News February 8, 2025

భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ తాత్కాళిక రద్దు

image

సికింద్రాబాద్-కాగజ్‌నగర్ మధ్య రోజువారీగా రాకపోకలు సాగించే భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ (రైలు నంబరు 17233,17234)ను ఈనెల 10 నుంచి 20 వరకు 11 రోజుల పాటు రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ఉత్తర్వులు జారీచేశారు. దీంతో కరీంనగర్, పెద్దపల్లి జిల్లా ప్రజలు ఇబ్బందులు పడనున్నారు. ఇటీవలి కాలంలో ఏ చిన్న సమస్య వచ్చినా రోజుల తరబడి రైళ్ల రాకపోకలను తాత్కాళికంగా రద్దుచేయడం పట్ల ప్రయాణికులు ఆగ్రహాం వ్యక్తంచేస్తున్నారు.

Similar News

News November 15, 2025

సూర్యాపేట: కారు బీభత్సం.. ముగ్గురికి గాయాలు (UPDATE)

image

సూర్యాపేట-జనగామ హైవేపై నాగారం బంగ్లా సమీపంలో ఓ కారు బీభత్సం సృష్టించింది. పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా కారు కానిస్టేబుల్‌ను ఢీ కొట్టింది. అనంతరం మరో బైక్‌ను ఢీ కొట్టడంతో మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిని సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ కారును స్పాట్‌లోనే వదిలిపెట్టి పరారయ్యాడు. కారు నెంబర్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

News November 15, 2025

సూర్యాపేట: కానిస్టేబుల్‌ను ఢీకొట్టిన కారు

image

సూర్యాపేట(D) తిరుమలగిరి(M) నాగారంలో సూర్యాపేట-జనగామ హైవేపై పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా జనగామ నుంచి సూర్యాపేట వెళ్తున్న కారు అతివేగంగా పోలీసు కానిస్టేబుల్‌ను ఢీకొట్టి వెళ్లిపోయింది. ఈ ఘటనలో కానిస్టేబుల్‌ కమలాకర్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. అతని పరిస్థితి విషమంగా ఉంది. తరువాత అటుగా వెళ్తున్న బైక్‌ను ఢీకొట్టడంతో బైక్‌పై ఉన్న ఇద్దరూ గాయపడ్డారు.

News November 15, 2025

1.20L గ్లైడ్ బాంబుల తయారీకి రష్యా ప్లాన్?

image

తమ దేశంపై దాడి కోసం రష్యా 1,20,000 గ్లైడ్ బాంబుల తయారీకి ప్రణాళిక సిద్ధం చేసినట్లు ఉక్రెయిన్ సీనియర్ ఇంటెలిజెన్స్ అధికారి ఒకరు ఆరోపించారు. వీటిలో 200KMకు పైగా లక్ష్యాలను చేరుకునే 500 లాంగ్ రేంజ్ వెర్షన్ బాంబులు కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. వీటి వల్ల ఉక్రెయిన్‌కు భారీ నష్టం వాటిల్లుతుందని తెలిపారు. ఈ ఆరోపణలపై మాస్కో స్పందించలేదు. కాగా 2022 నుంచి ఇరు దేశాల మధ్య యుద్ధం కొనసాగుతోన్న విషయం తెలిసిందే.