News February 8, 2025

భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ రద్దు

image

సికింద్రాబాద్-కాగజ్‌నగర్ మధ్య రోజువారీగా రాకపోకలు సాగించే భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ (రైలునంబరు 17233,17234)ను ఈనెల 10 నుంచి 20 వరకు 11 రోజుల పాటు రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ఉత్తర్వులు జారీచేశారు. దీంతో భువనగిరి జిల్లా ప్రజలు ఇబ్బందులు పడనున్నారు. ఇటీవలి కాలంలో ఏ చిన్న సమస్య వచ్చినా రోజుల తరబడి రైళ్ల రాకపోకలను తాత్కాలికంగా రద్దు చేయడం పట్ల ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News February 8, 2025

ఢిల్లీ ఫలితాలపై ఏలూరు జిల్లాలో టెన్షన్

image

ఢిల్లీలో ఎన్నికల ఫలితాలపై సర్వత్ర ఉత్కంఠ రేగుతోంది. అయితే ఢిల్లీ ఎన్నికల సెగ జిల్లాను సైతం సాగుతోంది. ఢిల్లీలో నేడు వెల్లడి కానున్న ఎన్నికల ఫలితాలపై ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జోరుగా పందేలు సాగుతున్నట్లు తెలుస్తోంది. బీజేపీ, ఆప్ మధ్య పోరు జరుగుతుండగా ఇక్కడి పందెం రాయుళ్లు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. తుది ఫలితాలు పూర్తిస్థాయిలో వెల్లడయ్యేసరికి పెద్ద ఎత్తున నగదు చేతులు మారనుంది.

News February 8, 2025

జనగామ: గ్రామాల్లో మొదలైన ‘స్థానిక’ సందడి!

image

ఈ నెలలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం కసరత్తు చేస్తున్నాయి. దీంతో జనగామ జిల్లాలోని అన్ని గ్రామాల్లో ఎన్నికల సందడి నెలకొంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలకు చెందిన ఆశావహులు మంతనాలు జరుపుతున్నారు. తమకు ఈసారి అవకాశం ఇవ్వాలని గ్రామాల్లోని కొందరు ఆయా పార్టీల ముఖ్య నేతలను కోరుతున్నారు. ఇప్పటికే పల్లెల్లో ఎన్నికల వాతావరణం మొదలైంది.

News February 8, 2025

BREAKING: నిజామాబాద్‌: రైలు కింద పడి యువకుడి ఆత్మహత్య

image

రైలు కింద పడి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడని నిజామాబాద్ రైల్వే ఎస్ఐ సాయిరెడ్డి శనివారం తెలిపారు. KM No 467-7 నుంచి 467- 8 మధ్య అకోలా నుంచి తిరుపతి వెళ్తున్న రైలు కిందపడి యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ రూంకు తరలించామన్నారు. మృతుడి గురించి సమాచారం తెలిస్తే 8712658591 నంబర్‌కు తెలపాలని SI సాయిరెడ్డి కోరారు.

error: Content is protected !!