News September 6, 2025
భాద్యతగా విధులు నిర్వహించాలి: కలెక్టర్

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గ్రామ పాలనాధికారులు బాధ్యతగా విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సూచించారు. కలెక్టరేట్‌లో జరిగిన గ్రామ పాలనాధికారుల కౌన్సెలింగ్‌లో ఆయన మాట్లాడుతూ.. నియామక పత్రాలు తీసుకున్న అధికారులు బాధ్యతతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వేణుమాధవ్, పరిపాలన అధికారి సుదర్శన్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Similar News
News September 7, 2025
రైతులకు యూరియా కొరత లేకుండా చూస్తాం: కలెక్టర్

రైతులకు యూరియా కొరత లేకుండా అందిస్తున్నామని కలెక్టర్ సి.నాగరాణి అన్నారు. కాళ్ల మండలం కోపల్లె సొసైటీలో యూరియా వినియోగంపై జరిగిన అవగాహన సదస్సులో ఆమె పాల్గొన్నారు. సొసైటీ గోడౌన్‌లోని ఎరువుల నిల్వలను తనిఖీ చేశారు. అధికారుల సూచనల మేరకు ఎరువులను వినియోగించుకుని అధిక దిగుబడులు సాధించాలని ఆమె రైతులకు సూచించారు. సొసైటీ ఛైర్మన్ పాల్గొన్నారు.
News September 7, 2025
విశాఖ: కొనసాగుతున్న సహాయక చర్యలు

ఈస్ట్ ఇండియా పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్‌లో పిడుగు పడిన విషయం తెలిసిందే. ఆయిల్ ఫిల్లింగ్ స్టేషన్ వద్ద పార్కింగ్ సమీపంలో ఉన్న ఇందనాల్ ట్యాంకర్ పై పిడుగు పడటంతో భారీగా మంటలు చెలరేగాయి. సంస్థలో మిగతా ట్యాంకులకు మంటలు వ్యాపించకుండా చర్యలు చేపట్టారు. మల్కాపురం పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. మంటలు అదుపులోకి రాకపోవడంతో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.
News September 7, 2025
పండగ రద్దీ తగ్గించేందుకు ఇతర స్టేషన్లకు రైళ్ల మళ్లింపు

దసరా, దీపావళి పండగల కోసం సొంతూరికి వెళ్లేందుకు ప్రయాణికులు సెప్టెంబర్ నుంచే సికింద్రాబాద్ స్టేషన్‌కు క్యూ కడతారు. అధిక రద్దీ కారణంగా ప్రయాణికులు ఇబ్బంది పడకుండా కొన్ని రైళ్లను ఇతర స్టేషన్లకు మళ్లించనున్నారు. సనత్‌నగర్, చర్లపల్లి, అమ్ముగూడ, మౌలాలి స్టేషన్లకు మళ్లించాలని నిర్ణయించారు. పండగ రద్దీ కారణంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సిటీ పోలీస్, ఆర్టీసీ సిబ్బంది సేవలను ఉపయోగించుకోనున్నారు.