News December 5, 2025
భామిని: లెర్నింగ్ టూల్స్‌ను పరిశీలించిన సీఎం

భామినిలోని జరిగిన మెగా PTM కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో సీఎం చంద్రబాబు
ముచ్చటించారు. అనంతరం విద్యార్థులకు ఇచ్చిన లెర్నింగ్ టూల్స్‌ను పరిశీలించి వారిని అభినందించారు. విద్యార్థులు భవిష్యత్తుపై దృష్టి సారించి విషయ పరిజ్ఞానాన్ని మరింత ముందుకెళ్లాలని సూచించారు. ప్రభుత్వం సాంకేతిక పరిజ్ఞానంపై ప్రత్యేక దృష్టి సారించిందని ఆయన తెలిపారు.
Similar News
News March 4, 2026
అలిపిరి వద్ద జింకపై చిరుత దాడి

తిరుపతి అలిపిరి వద్ద జింకపై చిరుత దాడి చేసి చంపింది. అలిపిరి వద్ద ద్విచక్ర వాహనాల పార్కింగ్ ప్రాంతంలో వేకువ జామున 3.30 గంటల సమయంలో ఘటన జరిగినట్లు సమాచారం. అప్రమత్తమై అధికారులు భక్తులను అలెర్ట్ చేశారు.
News March 4, 2026
ఆనాటి ‘రంగుల’ లోకాన్ని మిస్ అవుతున్నారా?

పురోహితుల సూచనతో చాలా ప్రాంతాల్లో హోలీ పండుగను ఇవాళే జరుపుకుంటున్నారు. అయితే చాలాచోట్ల ఒకప్పటి సందడి కనిపించట్లేదు. ముఖ్యంగా పట్టణాల్లో పిల్లలు, పెద్దలూ ఇళ్లకే పరిమితమవుతున్నారు. అదే ఒకప్పుడు ఫ్రెండ్స్‌తో ఊరంతా తిరిగి ఎంజాయ్ చేసేవాళ్లు. ఒళ్లంతా రంగులు పూసుకున్నా మనసు నిండా స్వచ్ఛమైన ఆనందం ఉండేది. ఏ టెన్షన్ లేకుండా నవ్వుతూ గడిపిన ఆ రోజులు మళ్లీ రావు. మీరూ ఒకప్పటి హోలీని మిస్ అవుతున్నారా? COMMENT
News March 4, 2026
NLG: భానుడి భగభగ.. గిర్రున తిరుగుతున్న మీటర్లు

NLG జిల్లాలో మార్చి ఆరంభంలోనే ఎండలు ముదురుతున్నాయి. వేడి నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు ఫ్రిడ్జ్‌లు, కూలర్లు, ఫ్యాన్ల వాడకాన్ని పెంచేశారు. దీంతో గృహ వినియోగ విద్యుత్ మీటర్లు గిర్రున తిరుగుతున్నాయి. జనవరితో పోలిస్తే ఫిబ్రవరిలో వినియోగం గణనీయంగా పెరగ్గా, ఈ నెలలో మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఎండల తీవ్రత పెరుగుతుండటంతో వినియోగదారులు విద్యుత్ పొదుపుపై దృష్టి సారించాలంటున్నారు.


