News November 7, 2025
భారతీయుల్లో ఐక్యత, గౌరవాన్ని పెంచే గీతం ‘వందే మాతరం’: SP

కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర నేతృత్వంలో “వందే మాతరం” 150వ వార్షికోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. ఎస్పీ మాట్లాడుతూ, వందే మాతరం గీతం భారతీయుల హృదయాల్లో దేశభక్తిని రగిలించిన ఉద్యమ నినాదమని పేర్కొన్నారు. ఈ వేడుకలు ప్రతి భారతీయునిలో దేశభక్తి, ఐక్యతతో పాటు జాతీయ గౌరవాన్ని మరింత బలపరుస్తాయని ఆయన అన్నారు.
Similar News
News November 7, 2025
పెద్దపల్లి: ‘ఇందిరమ్మ ఇండ్లను 100% గ్రౌండ్ చేయాలి’

PDPL జిల్లాలో మంజూరైన ఇందిరమ్మ ఇండ్లను 100% గ్రౌండ్ చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. PDPL నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్ల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించిన ఆయన, 800కి పైగా ఇండ్లు ఇంకా మార్కింగ్ కాలేదని అసంతృప్తి వ్యక్తంచేశారు. ఆసక్తిలేని లబ్ధిదారుల ఇండ్లు రద్దుచేయాలని, అవసరమైతే మహిళా సంఘాల ద్వారా రుణాలు అందించాలన్నారు. నిర్మాణపనులు వేగవంతం చేసి, వివరాలను ఆన్‌లైన్‌లో నమోదుచేయాలని తెలిపారు
News November 7, 2025
వనపర్తి నుంచి అరుణాచలానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సు

అరుణాచలంలో జరిగే గిరి ప్రదక్షిణకు వనపర్తి నుంచి ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సును ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ డీఎం దేవేందర్ గౌడ్ తెలిపారు. ఈ నెల 15న సాయంత్రం బయలుదేరి, 16న కాణిపాకం, వేలూరు దర్శనం అనంతరం అరుణాచలం చేరుకుంటుంది. పెద్దలకు రూ.3,600, పిల్లలకు రూ.2,400 ఛార్జీ ఉంటుందని, యాత్ర 18న ముగుస్తుందని ఆయన వివరించారు.
News November 7, 2025
పెద్దపల్లి: ‘పాఠశాలలను రెగ్యులర్‌గా తనిఖీ చేయాలి’

PDPL కలెక్టర్ కోయ శ్రీహర్ష ప్రభుత్వ పాఠశాలలను రెగ్యులర్‌గా తనిఖీ చేసి విద్యాప్రమాణాలు మెరుగుపర్చాలని ఆదేశించారు. మండల విద్యాధికారులు ఫీల్డ్ విజిట్‌లతోపాటు వివరాలను ఆన్‌లైన్‌లో నమోదుచేయాలని సూచించారు. శిథిలావస్థలో ఉన్న భవనాల వివరాలు NOV 10లోపు సమర్పించాలన్నారు. ప్రతిరోజు విద్యార్థులకు గంటసేపు రీడింగ్ స్కిల్స్‌పై దృష్టిపెట్టాలని, మధ్యాహ్న భోజన నాణ్యతపై 5% పాఠశాలల్లో ఆకస్మిక తనిఖీలు జరుపుతామన్నారు.


