News December 25, 2025

భారత్‌తో మా బంధంలో అమెరికా చిచ్చు పెడుతోంది: చైనా

image

భారత్‌తో తమ బంధాన్ని దెబ్బతీసేందుకు US యత్నిస్తోందని చైనా విదేశాంగశాఖ ప్రతినిధి లిన్ జియాన్ ఆరోపించారు. తమ సరిహద్దు వివాదంలో మూడో దేశం జోక్యం చేసుకోవద్దని అన్నారు. ఇటీవల విడుదల చేసిన నివేదికలో చైనా ఉద్దేశపూర్వకంగానే భారత్‌తో ఉద్రిక్తతలు తగ్గించుకొని.. భారత్-అమెరికా మైత్రిని అడ్డుకోవాలని చూస్తోందని పెంటగాన్(US) ఆరోపించింది. అరుణాచల్‌ను చైనా తన ‘కోర్ ఇంట్రెస్ట్’ జాబితాలో చేర్చిందని వెల్లడించింది.

Similar News

News December 27, 2025

యూరియా కష్టాలు.. చిన్న ఫోన్లలో యాప్ ఎలా?

image

తెలంగాణలో దాదాపు 60% రైతుల దగ్గర స్మార్ట్ ఫోన్లు లేకపోవడంతో యూరియా కష్టాలు తప్పడం లేదు. వారి చిన్న ఫోన్ నంబర్లకే ఆధార్, భూముల వివరాలు లింకై ఉన్నాయి. ఫోన్ మార్చితే పథకాలు రద్దవుతాయని భయపడుతున్నారు. ఫలితంగా స్మార్ట్ ఫోన్ కొని యూరియా యాప్ డౌన్‌లోడ్ చేసుకోలేకపోతున్నారు. దళారులను ఆశ్రయిస్తున్నారు. దీనిపై అధికారులు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

News December 27, 2025

‘మేకపోతుల బలి’ రాజకీయం!

image

AP: ఈ నెల 21న జగన్ పుట్టినరోజు సందర్భంగా చాలా చోట్ల YCP కార్యకర్తలు, అభిమానులు మేకపోతులను బలి ఇచ్చారు. వాటి రక్తాన్ని జగన్ ఫ్లెక్సీలపై చల్లుతూ, రప్పారప్పా నినాదాలు చేశారు. దీనిపై ప్రభుత్వం ఆగ్రహంగా ఉంది. ఇవాళ తూ.గో. జిల్లాలో ఏడుగురు కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా సినిమా రిలీజ్‌ల సందర్భంగా హీరోల ఫ్లెక్సీలపై రక్తం చల్లితే తప్పు లేదా అని వైసీపీ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు.

News December 27, 2025

ప్రెగ్నెన్సీ రాకపోవడానికి ఇవి కూడా కారణం కావొచ్చు

image

ఆరోగ్యకరమైన ప్రెగ్నెన్సీ రావడానికి ఎన్నో అంశాలు దోహదపడతాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఆలస్యంగా నిద్రపోవడం, అధిక ఒత్తిడికి గురవడం, ఫాస్ట్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం, వ్యాయామం చేయకపోవడం, అధిక/ తక్కువ బరువు, ధూమపానం వంటి అలవాట్ల వల్ల ప్రెగ్నెన్సీ లేట్ అవుతుందంటున్నారు. అందుకే ముందుగా పీరియడ్స్, ప్రెగ్నెన్సీ గురించి పూర్తి అవగాహన తెచ్చుకోవాలని సూచిస్తున్నారు.