News December 19, 2025
భారత్‌ను రెచ్చగొట్టే ప్లాన్‌తోనే దాడి: బంగ్లాదేశ్ మాజీ మంత్రి

బంగ్లాదేశ్‌లో భారత డిప్యూటీ హై కమిషనర్ ఇంటిపై ప్లాన్ ప్రకారమే దాడి చేశారని హసీనా సర్కారులో విద్యా మంత్రిగా చేసిన మొహిబుల్ హసన్ చౌదరి ఆరోపించారు. ఎన్నికలు వాయిదా వేయాలనే ఉద్దేశంతో మధ్యంతర ప్రభుత్వాన్ని నడిపిస్తున్న యూనస్ దేశంలో హింసను ప్రేరేపిస్తున్నారని విమర్శించారు. కింది స్థాయి పొలిటికల్ వర్కర్లను తొక్కేయాలని చూస్తున్నారన్నారు. భారత్‌ను రెచ్చగొట్టాలనే ఉద్దేశం కూడా దాడుల వెనుక ఉందని ఆరోపించారు.
Similar News
News December 23, 2025
రెండు రోజుల వరుస లాభాలకు బ్రేక్

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీల్లో రెండు రోజుల వరుస లాభాలకు బ్రేక్ పడింది. ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన మార్కెట్లు రోజంతా పరిమిత రేంజ్‌లో మూవ్ అయ్యాయి. చివరకు నిఫ్టీ 4 పాయింట్ల స్వల్ప లాభంతో 26,177 వద్ద , సెన్సెక్స్ 42 పాయింట్ల నష్టంతో 85,524 వద్ద స్థిరపడ్డాయి. ITC, అల్ట్రాటెక్, టాటా స్టీల్, HDFC లాభాల్లో.. ఇన్ఫీ, Airtel, అదానీపోర్ట్స్, సన్‌ఫార్మా, టెక్ మహీంద్రా షేర్లు నష్టాల్లో ముగిశాయి.
News December 23, 2025
త్వరలో 22వేల గ్రూప్-D పోస్టులకు నోటిఫికేషన్

RRB త్వరలో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని జోన్లలో కలిపి 22 వేల గ్రూప్-D పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనుంది. టెన్త్, ఐటీఐ అర్హత గల అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు. జనవరి 21 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. అభ్యర్థుల వయసు 18-33ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంటుంది. నెలకు జీతం రూ. 18,000 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.rrbapply.gov.in
News December 23, 2025
అడిషనల్ సొలిసిటర్ జనరల్‌గా కనకమేడల

సుప్రీంకోర్టులో మరో ఇద్దరు అడిషనల్ సొలిసిటర్ జనరల్స్‌ను నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులిచ్చింది. ఇందులో మాజీ ఎంపీ, అడ్వకేట్ కనకమేడల రవీంద్రకుమార్, దవీందర్‌పాల్ సింగ్‌కు చోటు కల్పించింది. వీరు మూడేళ్లపాటు పదవిలో కొనసాగనున్నారు. కాగా రవీంద్ర కుమార్ 2018 నుంచి 2024 వరకు టీడీపీ రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు.


