News January 7, 2026

భారత్‌లోనే బంగ్లా మ్యాచ్‌లు? జైషా నేతృత్వంలోని ICC సంచలన నిర్ణయం!

image

T20 వరల్డ్ కప్ మ్యాచ్‌లను భారత్ నుంచి శ్రీలంకకు మార్చాలన్న బంగ్లాదేశ్ విజ్ఞప్తిని జైషా నేతృత్వంలోని ICC తిరస్కరించినట్లు సమాచారం. మంగళవారం జరిగిన వర్చువల్ మీటింగ్‌లో బంగ్లా కోరికను తోసిపుచ్చినట్లు NDTV పేర్కొంది. భారత్‌లో ఆడటం తప్పనిసరని, లేదంటే పాయింట్లు కోల్పోతారని హెచ్చరించినట్లు తెలుస్తోంది. ముస్తాఫిజుర్ IPL వివాదం వంటి కారణాలతో మ్యాచ్ వేదికల మార్పును కోరుతూ ICCకి బంగ్లా బోర్డు లేఖ రాసింది.

Similar News

News February 7, 2026

ప్రీ డయాబెటీస్‌ని ఎలా గుర్తించాలంటే?

image

ప్రీ డ‌యాబెటిస్ అంటే డ‌యాబెటిస్‌కి ముందు స్టేజి. వీరిలో ర‌క్తంలో చక్కెర స్థాయిలు మ‌రీ అధికంగా ఉండ‌వు కానీ కాస్త ఎక్కువ‌గా ఉంటాయి. దీన్ని ప‌ట్టించుకోక‌పోతే డ‌యాబెటిస్ స్టేజిలోకి వెళ్తారు. వీరికి సాధార‌ణంగా వైద్యులు మందుల‌ను ఇవ్వ‌రు. కొన్నిరోజుల పాటు డైట్, వ్యాయామం చేయాల‌ని సూచిస్తారు. ప్రీ డయాబెటీస్ ఉన్న కొందరికి షుగర్ లక్షణాలుంటాయి. కానీ 35 ఏళ్లు దాటాక అందరూ షుగర్ టెస్టులు చేయించుకోవడం మంచిది.

News February 7, 2026

FEB 11న సెలవు ఇవ్వాలని SEC ఆదేశం

image

TG: మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా పోలింగ్ రోజైన ఫిబ్రవరి 11న స్థానిక సెలవు ప్రకటించాలని SEC జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. ఆ రోజున అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు సెలవు ప్రకటించాలని తెలిపింది. ప్రైవేట్ పరిశ్రమలకూ సెలవు ఇవ్వాలని సూచించారు. ఓటర్లు ఎటువంటి ఆటంకం లేకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలనే ఉద్దేశంతో సెలవు ప్రకటిస్తున్నట్లు SEC వెల్లడించింది.

News February 7, 2026

పాక్‌కు వ్యాక్సిన్ కష్టాలు: భారత్‌తో పెట్టుకుంటే తప్పదు మరి!

image

భారత్‌తో సంబంధాలు చెడగొట్టుకుంటే ఎలా ఉంటుందో పాక్‌కు ఒక్కొక్కటిగా తెలిసొస్తోంది. 2025 మే నాటి సైనిక ఘర్షణల తర్వాత ఇండియా నుంచి వ్యాక్సిన్ల సరఫరా నిలిచిపోవడంతో ఆర్థికంగా భారం పడుతోందని స్వయంగా ఆ దేశ మంత్రి ముస్తఫా వెల్లడించారు. GAVI ద్వారా ఇండియా నుంచి తక్కువ ధరకే టీకాలు పొందిన పాక్ ఇప్పుడు ఏటా $400 మిలియన్లు వెచ్చిస్తున్నట్లు చెప్పారు. సొంతంగా వ్యాక్సిన్లు తయారు చేసుకోవడం వారికి తప్పేటట్లులేదు.