News December 12, 2025
భారత్ ఘన విజయం

U-19 ఆసియా కప్‌లో UAEపై టీమ్ ఇండియా అద్భుత విజయాన్ని సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 433 పరుగులు చేసి కొత్త రికార్డు నెలకొల్పింది. వైభవ్ సూర్యవంశీ 171 పరుగులతో సంచలన ఇన్నింగ్స్ ఆడారు. భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో UAE 14 ఓవర్లకే వికెట్లు కోల్పోయింది. అనంతరం ఉద్దిశ్ సూరీ(78), పృథ్వీ మధు(50) పోరాడినా ఆ టీమ్ 199/7 రన్స్‌కే పరిమితమైంది.
Similar News
News December 12, 2025
వారికి ఇంటర్ ఎగ్జంప్షన్ పేపర్‌కు మార్కులు

AP: ఇంటర్ EXAMSలో దివ్యాంగులు ఎగ్జంప్షన్ పొందిన పేపర్‌కు ఇకపై సగటు MARKS ఇస్తారు. ఈమేరకు GO విడుదలైంది. వీరు 2 లాంగ్వేజ్ పేపర్లలో 1 రాస్తే చాలన్న రూలుంది. 5 పేపర్లలో 4కి MARKS వేసి మినహాయింపు పేపర్‌కు ‘E’ అని సర్టిఫికెట్లో పొందుపరుస్తున్నారు. అయితే ఈ సర్టిఫికెట్లపై IIT, NITలు అడ్మిషన్లు నిరాకరిస్తుండడంతో దివ్యాంగులు ఇబ్బంది పడగా గతేడాది లోకేశ్ జోక్యంతో సీట్లు దక్కాయి. ఇపుడన్నిటికీ MARKS ఇస్తారు.
News December 12, 2025
నటికి క్యాన్సర్.. పాపం ఎలా అయ్యారో చూడండి

టాలీవుడ్ సహాయ నటి వాహిని రొమ్ము క్యాన్సర్‌తో పోరాడుతున్నారు. ఆరోగ్యం క్షీణించడంతో ఆమెను HYDలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ట్రీట్‌మెంట్‌కి సుమారు ₹35లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు తెలిపినట్లు సమాచారం. విషయం తెలిసిన నటి కరాటే కళ్యాణి SMలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ఆమె చికిత్స కోసం ఆర్థిక సాయం చేయాలని కోరారు. అటు వాహిని త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ ప్రార్థిస్తున్నారు.
News December 12, 2025
ఘోరం.. బాలిక చెవి కొరుక్కుతిన్న కుక్క

AP: నంద్యాల జిల్లా ఆత్మకూరులో 4 ఏళ్ల చిన్నారిపై వీధికుక్క పాశవికంగా దాడి చేసింది. ఆసియా అనే బాలిక ఇంటి ముందు ఆడుకుంటుండగా ఒక్కసారిగా దాడి చేసి చెవిని కొరుక్కుతింది. చెంపతో పాటు ఇతర శరీర భాగాలపైనా తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
* పిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్త వహించండి


