News February 24, 2026
భారత్ – బల్గేరియా ఫ్రెండ్షిప్ గ్రూప్.. సానా సతీశ్‌కు అరుదైన గౌరవం!

18వ లోక్ సభ కాలానికి సంబంధించి బల్గేరియాతో పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్ ఏర్పాటయింది. ఇందులో సభ్యునిగా కాకినాడకు చెందిన రాజ్యసభ సభ్యుడు సానా సతీశ్‌ను లోక్ సభ స్పీకర్ ఓం ప్రకాశ్ బిర్లా మంగళవారం నామినేట్ చేశారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందాలను విస్తరించేలా చర్యలు తీసుకుంటానని సానా సతీశ్ తెలిపారు. తనకు ఈ అవకాశం కల్పించిన స్పీకర్‌కు ధన్యవాదాలు తెలిపారు.
Similar News
News February 28, 2026
SVUలో వివిధ పరీక్ష ఫలితాల విడుదల.!

SVU పరిధిలో గత ఏడాది ఆగస్టులో బీఫార్మసీ మొదటి సెమిస్టర్, ఏప్రిల్‌లో M.A ఇంగ్లిష్/ హిస్టరీ/ ఫిలాసఫీ/ సాంస్క్రిట్/ తమిళ్/ సోషియాలజీ, M.Com రెండో సెమిస్టర్, SVU DDE పరిధిలో ఎంఎస్సీ (M.Sc) కెమిస్ట్రీ మొదటి సంవత్సరం పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షల ఫలితాలు విడుదలైనట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినర్ రాజమాణిక్యం తెలియజేశారు. ఫలితాలను https://www.manabadi.co.in/ వెబ్ సైట్ ద్వారా తెలుసుకోగలరు.
News February 28, 2026
అలిపిరి చెక్‌పోస్ట్ వద్ద మొత్తం 217 డ్రోన్లు స్వాధీనం

అలిపిరి చెక్‌పోస్ట్ వద్ద విజిలెన్స్&సెక్యూరిటీ సిబ్బంది తనిఖీల్లో డ్రోన్లు, స్పై కెమెరా గల మెటా గ్లాసెస్ భారీగా పట్టుబడ్డాయి. 2025లో 151 డ్రోన్లు, 44 గ్లాసెస్, 2026 జనవరిలో 47 డ్రోన్లు, 13 గ్లాసెస్, ఫిబ్రవరిలో ఇప్పటివరకు 19 డ్రోన్లు, 14 గ్లాసెస్‌ను సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. తిరుమలలో డ్రోన్లు, గూఢచారి కెమెరాలు నిషేధమని విజిలెన్స్ అధికారులు స్పష్టం చేశారు.
News February 28, 2026
ఖమ్మం కూల్చివేతలపై ఎన్‌హెచ్ఆర్సీ దర్యాప్తు?

ఖమ్మం జిల్లాలో భూదాన్ భూముల పేరుతో సుమారు 600 పేదల ఇళ్లను కూల్చి వేసిన ఘటన తీవ్ర వివాదానికి దారి తీసింది. ఈ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ దర్యాప్తు ప్రారంభించింది. ప్రముఖ న్యాయవాది రామారావు ఇమ్మానేని ఫిర్యాదు మేరకు కలెక్టర్ అనుదీప్, అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని కమిషన్ ఆదేశించినట్లు సమాచారం.


