News December 30, 2025

భారత్ విజయం.. సిరీస్ క్లీన్‌స్వీస్

image

శ్రీలంక ఉమెన్స్‌ టీమ్‌తో జరిగిన 5 టీ20ల సిరీస్‌ను భారత అమ్మాయిలు వైట్‌వాష్ చేశారు. తాజాగా చివరి టీ20లోనూ అదరగొట్టి 15 రన్స్ తేడాతో విజయం సాధించారు. 176 రన్స్ టార్గెట్‌తో బరిలోకి దిగిన లంక 160/7 పరుగులకే పరిమితమైంది. భారత జట్టులో దీప్తి, అరుంధతి, స్నేహ్ రాణా, వైష్ణవి, శ్రీచరణి, అమన్‌జోత్ తలో వికెట్ తీశారు.

Similar News

News February 8, 2026

భారత్‌-పాక్ మ్యాచ్.. కాసేపట్లో నిర్ణయం!

image

టీ20 వరల్డ్ కప్‌ నుంచి బంగ్లాదేశ్ తప్పుకున్న విషయం తెలిసిందే. వారికి మద్దతుగా టీమ్ ఇండియాతో తాము మ్యాచ్ ఆడబోమని పాక్ ప్రధాని షరీఫ్ ప్రకటించారు. అయితే PCB మనసు మార్చుకున్నట్లు సమాచారం. ఈనెల 15న కొలంబో వేదికగా భారత్‌తో జరగనున్న మ్యాచ్‌లో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాసేపట్లో ICC అఫీషియల్స్-PCB సభ్యులు భేటీకానున్నారు. ఈ సమావేశం ముగిశాక అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది.

News February 8, 2026

షుగర్ కంట్రోల్‌కు బెస్ట్ ఫుడ్స్ ఇవే..

image

బ్లడ్ షుగర్ లెవెల్స్‌పై ప్రభావం చూపే ఫుడ్స్‌కు గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ సౌరభ్ సేథి రేటింగ్ ఇచ్చారు. ప్రొటీన్, ఫైబర్ అధికంగా ఉండే గుడ్లు, పచ్చని కూరగాయలు (10/10) మేటి ఆహారాలుగా నిలిచాయి. నట్స్ (9/10), బెర్రీలు (8/10) షుగర్ పెరగకుండా కంట్రోల్ చేస్తాయి. అయితే వైట్ రైస్ (3/10), ఫ్రూట్ జ్యూస్ (2/10) రక్తంలో చక్కెరను వేగంగా పెంచుతాయని, షుగరీ డ్రింక్స్ (0/10) చాలా డేంజర్ అని హెచ్చరించారు.

News February 8, 2026

సెలవులు.. ఏ నెలలో ఎక్కువ అంటే..

image

ప్రతి నెలా క్యాలెండర్ మారగానే ఈ మంత్‌లో సెలవులెన్ని అని చెక్ చేస్తాం కదా. ఇంతకీ ఎక్కువ సెలవులు ఉండే నెల ఏదో తెలుసా? Ans: అక్టోబర్. గాంధీ జయంతి, నవరాత్రులు- దసరా, దీపావళి- అనుబంధ పండుగలతో ఆ నెలంతా ఫెస్ట్ మూడే. ఆ తర్వాత మార్చ్-ఏప్రిల్ మాసాల్లో హోలి, గుడ్ ఫ్రైడే సహా ఉగాది లాంటి ప్రాంతీయ పండుగలతో ఎక్కువ సెలవులు వస్తాయి. ఇవి సరే.. సెలవులే లేని నెల ఏదైనా ఉందా అంటే.. ఉంది. అదే.. మన మే తర్వాతి జూన్.