News February 2, 2025
భారత జట్టుకు అభినందనలు: హోం మంత్రి అనిత
రెండవ సారి విశ్వ విజేతగా నిలిచిన భారత మహిళా క్రికెట్ అండర్-19 జట్టుకు ఏపీ ప్రభుత్వం తరఫున హోం మంత్రి వంగలపూడి అనిత ఎక్స్‌లో అభినందనలు తెలిపారు. కౌలాలంపూర్ వేదికగా సౌత్ ఆఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో తెలంగాణకు చెందిన గొంగడి త్రిష మూడు వికెట్లు తీసి 44 పరుగులతో విజయంలో కీలక పాత్ర పోషించిందన్నారు. బౌలింగ్‌లో విశాఖకు చెందిన షబ్నం ఒక వికెట్ తీయడం సంతోషాన్ని కలిగించిందన్నారు.
Similar News
News February 2, 2025
రాజమండ్రి: ఇంటిపై దాడిని ఖండించిన ముద్రగడ కుమార్తె
తన తండ్రి మాజీ మంత్రి ముద్రగడ ఇంటిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ముద్రగడ పద్మనాభరెడ్డి కుమార్తె జనసేన నాయకురాలు బార్లంపూడి క్రాంతి తెలిపారు. రాజమండ్రిలో ఆమె పార్టీ నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. నాన్న ఇంటిపై దాడి జరగడం చాలా బాధాకరమన్నారు. డిప్యూటీ సీఎం ఇటువంటి దాడులకు పూర్తి వ్యతిరేకమని పేర్కొన్నారు. డబ్బులు ఇచ్చి జనసేన నాయకులు చేయించారని వచ్చిన ఆరోపణలను ఆమె ఖండించారు.
News February 2, 2025
ములుగు: రేపు ప్రజావాణి రద్దు
ములుగు కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం జరగనున్న ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ ప్రకటనలో తెలిపారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో జిల్లా అధికారులు, సిబ్బంది ఎన్నికల విధుల్లో ఉన్నందున ప్రజల సౌకర్యార్థం ఇబ్బంది కలగకుండా ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు చెప్పారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
News February 2, 2025
అలా జరగకపోతే పేరు మార్చుకుంటా: డైరెక్టర్
‘తండేల్’ డైరెక్టర్ చందూ మొండేటి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమాను లవర్స్ రిపీటెడ్‌గా చూడకపోతే తన పేరు మార్చుకుంటానని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. కాగా నాగచైతన్య, సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ మూవీ వాస్తవిక ఘటనల ఆధారంగా తెరకెక్కింది. ఈ నెల 7న థియేటర్లలో రిలీజ్ కానుంది.