News December 18, 2025
భారత జట్టుకు ఆడిన పాక్ ప్లేయర్.. విచారణకు ఆదేశం

పాకిస్థాన్ కబడ్డీ ప్లేయర్ ఉబైదుల్లా రాజ్‌పుత్ భారత్ తరఫున ఆడటం వివాదాస్పదంగా మారింది. బహ్రెయిన్‌లో జరిగిన ఓ టోర్నీలో అతడు ఇండియన్ జెర్సీ, జెండాతో కనిపించడంపై PKF విచారణకు ఆదేశించింది. అనధికారిక మ్యాచ్‌లో అనుమతి లేకుండా ఆడారని పీకేఎఫ్ సెక్రటరీ రాణా సర్వార్ తెలిపారు. దీనిని ఉపేక్షించబోమని, విచారణ చేసి కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. మరోవైపు రాజ్‌పుత్ క్షమాపణలు చెప్పారు.
Similar News
News December 21, 2025
₹లక్ష కోట్లు దోచుకున్న జగన్‌కు పరకామణి చోరీ చిన్నదే కావొచ్చు: లోకేశ్

AP: తిరుమల పరకామణిలో చోరీపై Ex CM జగన్ స్పందన ఆయన దోపిడీ స్థాయిని వెల్లడిస్తోందని మంత్రి నారా లోకేశ్ విమర్శించారు. ‘జనం సొమ్ము ₹లక్ష కోట్లు దోచుకున్న జగన్‌కు పరకామణి చోరీ చిన్నదే కావొచ్చు. ఈ చోరీ పెద్ద పాపం. సాక్షులు, సాక్ష్యాధారాలు లేకుండా చేసి తప్పించుకోవడానికి ఇది బాబాయి కేసో, కోడి కత్తి కేసో కాదు. వెంకన్నకు చేసిన మహా అపచారం. ఆ దేవదేవుడి కోర్టు నుంచి తప్పించుకోవడం అసాధ్యం’ అని ట్వీట్ చేశారు.
News December 21, 2025
NHIDCLలో 48 ఉద్యోగాలు.. అప్లై చేశారా?

నేషనల్ హైవేస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (NHIDCL) 48 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. బీఈ, బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు DEC 31వరకు అప్లై చేసుకోవచ్చు. Sr మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, జనరల్ మేనేజర్, Sr జనరల్ మేనేజర్ పోస్టులు ఉన్నాయి. ఎలిజిబిలిటీ టెస్ట్, రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.nhidcl.com/
News December 21, 2025
విష్ణు వైభవం: సర్వశక్తిమంతమైన రూపాలు

మరీచిర్దమనో హంసస్సుపర్ణో భుజగోత్తమః|
హిరణ్యనాభస్సుతపాః పద్మనాభః ప్రజాపతిః||
శ్రీనివాసుడు మనకు వెలుగునిస్తాడు. ధర్మాన్ని తప్పిన వారిని శిక్షిస్తాడు. హంస రూపుడు, గరుత్మంతుడు, సర్పశ్రేష్ఠుడు, పద్మనాభుడు అయనే. కఠిన తపస్సు ఆయనే, సకల జీవుల పుట్టుకకు కారణం ఆయనే. అణువణువులో, అనంతంలో ఉన్న ఆయనని పూజించాలి. సృష్టిలోని ప్రతి జీవిని గౌరవించాలి. సత్కర్మలతో ఆ వెలుగును చేరుకోవాలి. <<-se>>#VISHNUSAHASRANAMAM<<>>


