News February 6, 2025
భారత దివ్యాంగుల క్రికెట్ జట్టు కెప్టెన్‌గా హిందూపురం యువకుడు

హిందూపురానికి చెందిన వసంత్ కుమార్ భారత దివ్యాంగుల క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యారు. ఈ నెల 15 నుంచి 18వ తేదీ వరకు నేపాల్‌లో జరగనున్న టీ20 సిరీస్‌లో భారత జట్టు పాల్గొననుంది. ఈ టీమ్‌కు వసంత్ నాయకత్వం వహిస్తారు. ఈ సందర్భంగా ఆయనను వైసీపీ నేత గుడ్డంపల్లి వేణు రెడ్డి ఆధ్వర్యంలో నేతలు ఘనంగా సత్కరించారు. విజేతగా తిరిగి రావాలని ఆకాంక్షించారు.
Similar News
News December 14, 2025
సిర్నాపల్లిలో దొంగ ఓటుకు యత్నం.. ఉద్రిక్తత

ఇందల్వాయి మండలం సిర్నాపల్లిలో ఓటింగ్ సమయంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. ఓ వర్గానికి చెందిన ఓ వ్యక్తి తన ఓటును వేశాడు. విదేశాల్లో ఉండే మరో వ్యక్తి ఓటును వేసేందుకు మళ్లీ పోలింగ్ బూత్‌లోకి ప్రవేశించాడు. అయితే బూత్ ఏజెంట్లు, ఎన్నికల అధికారుల అప్రమత్తతతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనతో గ్రామంలో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
News December 14, 2025
గద్వాల్ జిల్లాలో తొలి సర్పంచ్ గెలుపు ఇక్కడే..!

జోగులాంబ గద్వాల జిల్లాలో ఆదివారం జరిగిన నాలుగు మండలాల గ్రామ పంచాయితీ ఎన్నికల ఫలితాలు ఆదివారం అధికారులు విడుదల చేస్తున్నారు. మల్దకల్ మండలం శేషంపల్లి సర్పంచ్‌గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎస్ కాంతమ్మ 25 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆమె గ్రామస్థులకు, తనకు మద్దతు తెలిపిన అనుచరులకు కృతజ్ఞతలు తెలిపారు.
News December 14, 2025
నల్లబెల్లి ఆసక్తికర పోరు.. తల్లిపై కూతురు విజయం

వరంగల్ జిల్లాలోని నల్లబెల్లి మండల కేంద్ర పంచాయతీ పరిధి నాలుగో వార్డులో జరిగిన ఎన్నికల్లో తల్లిపై కూతురు విజయం సాధించారు. ఈ సమరంలో తల్లి సరోజనపై కూతురు సౌజన్య స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ 120 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. బీఆర్ఎస్ మద్దతుతో బరిలోకి దిగిన సౌజన్య గెలుపు ఆ పార్టీకి బలమైన ఉత్సాహాన్ని ఇచ్చిందని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.


