News February 2, 2026
భారత షట్లర్ దేవికా సిహాగ్ అద్భుత విజయం

భారత యువ షట్లర్ దేవికా సిహాగ్ సంచలన విజయం నమోదు చేశారు. హరియాణాకు చెందిన ఈ 20 ఏళ్ల ప్లేయర్ BWF ‘థాయ్‌లాండ్ మాస్టర్స్ 300’ మహిళల సింగిల్స్ టైటిల్‌ను కైవసం చేసుకున్నారు. ఫైనల్లో 21-8, 6-3తో మలేషియా షట్లర్ గోజిన్ వీపై దేవికా గెలిచారు. దీంతో తన కెరీర్‌లో తొలిసారి BWF 300 టైటిల్‌ను సొంతం చేసుకున్నారు. పీవీ సింధు, సైనా నెహ్వాల్ తర్వాత ఈ ఘనత సాధించిన మూడో ప్లేయర్‌గా దేవికా నిలిచారు.
Similar News
News February 17, 2026
హీరో తండ్రి కన్నుమూత

బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా తండ్రి సునీల్ మల్హోత్రా కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఫిబ్రవరి 14న మరణించగా తాజాగా ఆ వార్త బయటకు వచ్చింది. ఢిల్లీలో కుటుంబసభ్యుల మధ్య అంత్యక్రియలు పూర్తయ్యాయి. దీనికి సిద్ధార్థ్, ఆయన భార్య కియారా అద్వాణీ హాజరయ్యారు. సునీల్ గతంలో మర్చంట్ నేవీ కెప్టెన్‌గా పని చేశారు.
News February 17, 2026
AI వల్ల ఉద్యోగాలు పోవు.. స్కిల్స్ పెంచుకోవడమే మార్గం: మోదీ

AI వల్ల ఉద్యోగాలు పోవని, మార్పులకు అనుగుణంగా స్కిల్స్ పెంచుకోవడమే మార్గమని ప్రధాని మోదీ అన్నారు. ఈ ఆధునిక సాంకేతికత మనుషులను తొలగించబోదని, సామర్థ్యాన్ని మాత్రమే పెంచుతుందని పేర్కొన్నారు. టెక్నాలజీ మారినప్పుడల్లా కొత్తరకం ఉద్యోగాలు పుట్టుకొస్తాయని అందుకే ప్రభుత్వం రీ-స్కిల్లింగ్‌పై భారీగా పెట్టుబడి పెడుతోందని చెప్పారు. గ్లోబల్ AI ఇండెక్స్‌లో భారత్ మూడో స్థానంలో ఉండటం మన సత్తాకు నిదర్శనమన్నారు.
News February 17, 2026
రాష్ట్రంలో వాలంటీర్ల నియామకం.. ఫొటోకు రూ.7-10

TG: పంటల నమోదు సర్వే కోసం ప్రతి గ్రామానికి ఒక వాలంటీర్ చొప్పున 10,909 మందిని నియమించాలని వ్యవసాయశాఖ నిర్ణయించింది. టెన్త్ నుంచి డిగ్రీ వరకు చదివి గ్రామ భూములపై అవగాహన ఉన్న వారికి ప్రాధాన్యం ఉంటుంది. ఒక్కో ఫొటోకు రూ.7 నుంచి రూ.10 వరకు చెల్లిస్తారు. 45 రోజుల యాసంగి సీజన్‌లో 2000 ఫోటోల వరకు అప్‌లోడ్ చేయవచ్చు. విద్యార్హత పత్రాలతో మండల వ్యవసాయ అధికారుల దగ్గర దరఖాస్తు చేసుకోవాలి.


