News January 31, 2026

భారీగా తగ్గిన బంగారం ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు భారీగా దిగొచ్చాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ ₹8,620 తగ్గి ₹1,60,580కు చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ₹7,900 తగ్గి ₹1,47,200గా నమోదైంది. ప్రాంతాన్ని బట్టి ధరల్లో స్వల్ప తేడాలు ఉండొచ్చు.

Similar News

News February 18, 2026

ప్రకృతి సేద్యం.. APCNF ప్రధాన ఉద్దేశం ఇదే

image

వ్యవసాయాన్ని ప్రకృతి సూత్రాలకు అనుగుణంగా తక్కువ ఖర్చుతో, దీర్ఘకాలిక స్థిరత్వంతో సాగించే విధానంగా అభివృద్ధి చేయడమే APCNF లక్ష్యం. మొక్కకు కాదు, నేలకు ఆహారం అందించాలనే ప్రధాన ఉద్దేశంతో ఇది ముందుకు సాగుతోంది. ఘన, ద్రవ జీవామృతం, బ్రహ్మాస్త్రం, నీమాస్త్రం, అగ్నాస్త్రం సహా ఇతర సహజ సూక్ష్మపోషకాలను పంటలకు అందిస్తూ, ఆరోగ్యకరమైన ఆహారాన్ని ప్రజలకు చేరువ చేయడంలో APCNF కీలకపాత్ర పోషిస్తోంది.

News February 18, 2026

టెన్త్ పరీక్షల గ్యాప్‌లోనూ క్లాసులు!

image

TG: టెన్త్ పరీక్షల మధ్య గ్యాప్‌లో విద్యార్థులకు క్లాసులు తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు. ఎగ్జామ్స్ మధ్య 3-5 రోజుల వ్యవధి ఉండటంతో సూడెంట్లు స్కూలుకు రావాలని ఆదేశించారు. ఆయా రోజుల్లో 3 పీరియడ్ల చొప్పున క్లాసులు తీసుకోనున్నారు. మార్చి 14 నుంచి పరీక్షలు జరగనుండగా, విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు ఎక్కువ గ్యాప్ ఉండేలా షెడ్యూల్ రూపొందించారు. ఆ గ్యాప్‌లో ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నారు.

News February 18, 2026

ప్రమాదానికి ఏడాది.. మళ్లీ పనులు మొదలు

image

TG: శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్(SLBC) తవ్వకం మళ్లీ మొదలైంది. డ్రిల్లింగ్, బ్లాస్టింగ్ పద్ధతిలో పనులు చేపట్టారు. గతేడాది ఫిబ్రవరిలో టీబీఎం మెషీన్‌తో తవ్వకాలు జరుపుతుండగా టన్నెల్ కూలిన విషయం తెలిసిందే. ఈ ఘోర ప్రమాదంలో 8 మంది మరణించారు. దీంతో మెషీన్ తవ్వకాలు నిలిపివేసి బ్లాస్టింగ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అన్ని భద్రతా ప్రమాణాలు పాటించి పనులు కొనసాగించాలని అధికారులను ఆదేశించింది.