News December 30, 2025

భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

image

కొంతకాలంగా పెరుగుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు ఇవాళ భారీగా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.3,050 తగ్గి రూ.1,36,200కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.2,800 పతనమై రూ.1,24,850 పలుకుతోంది. అటు వెండి ధర ఏకంగా రూ.23వేలు తగ్గి కిలో రూ.2,58,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

Similar News

News December 30, 2025

అరటి గెలల నాణ్యత పెరగాలంటే?

image

అరటిలో పండు పరిమాణం, నాణ్యత పెంచేందుకు గెలల్లోని ఆఖరి హస్తం విచ్చుకున్న 5వ రోజు మరియు 15వ రోజున లీటరు నీటికి సల్ఫేట్ ఆఫ్ పొటాష్ 5 గ్రాములను కలిపి గెలలపై పిచికారీ చేయాలి. దీనితో పాటు 2 శాతం రంద్రాలు చేసిన తెల్లని పారదర్శక పాలిథీన్ సంచులను గెలలకు తొడగాలి. దీని వల్ల అరటిపండ్ల పరిమాణం పెరిగి లేత ఆకుపచ్చ రంగులో ఆకర్షణీయంగా తయారై నాణ్యమైన పండ్లను పొందవచ్చు. ఇవి ఎగుమతికి అనుకూలంగా ఉంటాయి.

News December 30, 2025

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీలో అప్రెంటిస్ పోస్టులు

image

CSIR-నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ 14 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనుంది. డిప్లొమా, గ్రాడ్యుయేట్ అర్హతల వారు జనవరి 8న ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. అభ్యర్థులు ముందుగా అప్రెంటిస్ పోర్టల్‌ (NATS)లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. డిప్లొమా అప్రెంటిస్‌లు 18-24ఏళ్ల మధ్య, డిగ్రీ అప్రెంటిస్‌లు 21 నుంచి 26ఏళ్ల మధ్య వయసు ఉండాలి. రిజర్వేషన్‌ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. వెబ్‌సైట్: https://www.nio.res.in

News December 30, 2025

ప్రియాంకా గాంధీ కుమారుడితో ఎంగేజ్‌మెంట్.. ఎవరీ అవివా బేగ్?

image

ప్రియాంకా గాంధీ కుమారుడు రైహాన్ వాద్రాతో ఎంగేజ్‌మెంట్ వార్తలతో అవివా బేగ్ పేరు ఇప్పుడు SMలో మారుమోగుతోంది. ఢిల్లీకి చెందిన ఆమె ఒక ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్. జర్నలిజం చదివిన అవివా ‘అటెలియర్ 11’ అనే ఫొటోగ్రఫీ స్టూడియోను నడుపుతున్నారు. సామాన్య ప్రజల జీవనశైలిని తన కెమెరాలో బంధించడంలో ఆమెది ప్రత్యేక శైలి. పలు ఆర్ట్ గ్యాలరీల్లో ఫొటోలను ప్రదర్శించిన అవివా.. వెర్వ్ వంటి పాపులర్ మ్యాగజైన్లలో కూడా పనిచేశారు.