News February 28, 2026
భారీగా పడిపోయిన టమాటా ధరలు

తెలుగు రాష్ట్రాల్లో టమాటా ధరలు భారీగా పడిపోయాయి. ఉమ్మడి వరంగల్‌లో 25 కేజీల పెట్టె నవంబర్‌లో రూ.900 వరకు ఉండగా ప్రస్తుతం రూ.60-80 మాత్రమే పలుకుతోంది. అంటే కేజీకి రూ.2-3 మాత్రమే. రవాణా ఖర్చులు కూడా మిగలట్లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. కొందరు ఫ్రీగా పంచిపెడుతుంటే మరికొందరు చేనులోనే వదిలేస్తున్నారు. అటు ఏపీలోని మదనపల్లెలోనూ ఇదే పరిస్థితి ఉంది. ఇక బహిరంగ మార్కెట్లో కేజీ రూ.5-10 వరకు అమ్ముతున్నారు.
Similar News
News March 2, 2026
ఈనెల 15లోగా పరిహారం అందిస్తాం: మంత్రి పొంగులేటి

TG: వెలుగుమట్ల <<19243377>>భూవివాదాన్ని<<>> ప్రతిపక్షాలు రాజకీయం చేయడం మానుకోవాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ హెచ్చరించారు. అర్హులైన పేదలకు ఈనెల 15లోపు ఇళ్ల స్థలాలతో పాటు ₹5లక్షల పరిహారం ఇప్పిస్తానని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో అధికారుల తప్పు ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా అక్రమ గృహాల తొలగింపుతో ₹250 కోట్ల విలువైన భూమిని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
News March 2, 2026
ఒక్క ఇన్నింగ్స్‌తో రోహిత్, కోహ్లీ రికార్డులు బ్రేక్!

విండీస్‌తో మ్యాచ్‌లో సంజూ శాంసన్ రికార్డులు బద్దలు కొట్టారు. టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లో అత్యధిక బౌండరీలు (16) బాదిన భారత ప్లేయర్‌గా రోహిత్ శర్మ (15) రికార్డ్ బ్రేక్ చేశారు. అలాగే ఛేజింగ్‌లో అత్యధిక రన్స్ (97*) స్కోర్ చేసి విరాట్ కోహ్లీ (82*) రికార్డ్ అధిగమించారు. కోహ్లీ 2016లో AUSపై, 2022లో PAKపై ఈ రన్స్ చేశారు. T20Iల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు (3) దక్కిన ఇండియన్ కీపర్ కూడా సంజూనే.
News March 2, 2026
సౌదీ సైలెంట్‌గా పావులు కదిపిందా?

ఇరాన్‌పై US దాడుల వెనుక సౌదీ అరేబియా ప్రిన్స్ సల్మాన్ హస్తం ఉందని వాషింగ్టన్‌పోస్ట్ కథనం వెల్లడించింది. ఇరాన్‌కు బహిరంగంగా మద్దతు తెలిపినా, దాడి చేయమని సల్మానే ట్రంప్‌ను ప్రోత్సహించి ఒప్పించినట్లు పేర్కొంది. షియా సిద్ధాంతాలు, ఇరాన్ ప్రభావం వ్యాపించకూడదని సౌదీ ప్లాన్ చేయగా.. తమ సరిహద్దుల్లో ఇరాన్ పోషిస్తున్న మిలిటెంట్ల బెడద తగ్గించుకోవడం సులువు అవుతుందని ఇజ్రాయెల్ ఇందుకు సహకరించినట్లు తెలుస్తోంది.


