News January 2, 2026

భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర ఇవాళ రూ.1,140 పెరిగి రూ.1,36,200కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.1,050 ఎగబాకి రూ.1,24,850 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.4,000 పెరిగి రూ.2,60,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

Similar News

News February 23, 2026

చరిత్రలో ఈరోజు (ఫిబ్రవరి 23)

image

1455- గూటెన్‌బర్గ్ తొలి బైబిల్ ముద్రణ పూర్తి
1876- ప్రముఖ సంఘ సంస్కర్త గాడ్గే మహరాజ్ జననం
1893- డీజిల్ ఇంజిన్‌కు పేటెంట్
1913- ప్రముఖ ఇంద్రజాలికుడు పి.సి.సర్కార్ జననం
1954- పోలియో వ్యాక్సిన్‌ మొదటిసారిగా పిల్లలపై ప్రయోగం
1957- దివంగత మాజీ మంత్రి ఎర్రన్నాయుడు జననం
1969- అలనాటి హీరోయిన్ మధుబాల మరణం (ఫొటోలో)
* World Understanding and Peace Day

News February 23, 2026

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

News February 23, 2026

మరో తేజస్ యుద్ధ విమానానికి ప్రమాదం.. పైలట్ సేఫ్!

image

IAFకు చెందిన తేజస్ యుద్ధ విమానం సాంకేతిక లోపంతో ప్రమాదానికి గురైనట్లు సమాచారం. జాతీయ మీడియా కథనాల ప్రకారం.. శిక్షణలో భాగంగా ల్యాండవుతున్న టైమ్‌లో ఈ ఘటన జరిగింది. పైలట్ అప్రమత్తంగా వ్యవహరించి ఎజెక్ట్ అవ్వడంతో ప్రాణాపాయం తప్పింది. ఈనెల ఆరంభంలో జరిగిన ఈ ప్రమాదం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తేజస్ విమానాల్లో ఇది మూడో ప్రమాదం. దీంతో మొత్తం ఫ్లీట్‌పై తనిఖీలు చేపట్టాలని IAF నిర్ణయించింది.