News April 2, 2024
భారీగా మద్యం అమ్మకాలు

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మద్యం అమ్మకాలు తారాస్థాయికి చేరుకున్నాయి. జిల్లాలో 210 మద్యం దుకాణాలు, 50 బార్లు, 3 క్లబ్బులున్నాయి. వీటి పరిధిలో 2023-24 ఆర్థిక సంవత్సరంలో మద్యం అమ్మకాలు రూ.2,700 కోట్లు. వీటిలో 29.11 లక్షల లిక్కర్ కేసులు, 20.10 లక్షల బీర్ల కేసుల విక్రయాలు జరిగాయి. నూతన వ్యాపారులు డిసెంబరు నుంచి మార్చి వరకు నాలుగు నెలల్లోనే రూ.వెయ్యి కోట్లకు మించిన మద్యం అమ్మకాలు చేయడం మరో విశేషం.
Similar News
News November 12, 2025
వెలుగుమట్లలో సైనిక్ స్కూల్ అర్హతల పరిశీలన

ఖమ్మం జిల్లాలో సైనిక్ స్కూల్ ఏర్పాటు అర్హత పరిశీలనలో భాగంగా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి బుధవారం వెలుగుమట్లలోని శ్రీ చైతన్య విస్టా పాఠశాలను పరిశీలించారు. కేంద్ర ప్రభుత్వం పిపిపి మోడ్‌లో దేశవ్యాప్తంగా 100 సైనిక్ స్కూల్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించిందని కలెక్టర్ తెలిపారు. ఖమ్మంలో దరఖాస్తు చేసిన ఈ పాఠశాల అర్హతను కమిటీ పరిశీలన ఆధారంగా నిర్ణయిస్తుందని అన్నారు.
News November 12, 2025
ఖమ్మం: దివ్యాంగుల పురస్కారాలకు దరఖాస్తులు ఆహ్వానం

అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా దివ్యాంగుల సాధికారిత రాష్ట్ర పురస్కారాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా దివ్యాంగుల సంక్షేమశాఖ అధికారి రాంగోపాల్రెడ్డి తెలిపారు. అర్హులైన వ్యక్తులు, సంస్థలు ఆన్‌లైన్‌లో ఉన్న దరఖాస్తు ఫారాలు, మార్గదర్శకాలను ఉపయోగించుకోవాలని కోరారు. పూర్తి చేసిన దరఖాస్తులను ఈ నెల 20వ తేదీలోపు కార్యాలయంలో సమర్పించాలి.
News November 12, 2025
ఖమ్మం: బోనస్‌పై అనుమానం.. కొనుగోళ్లలో జాప్యం

ఖమ్మం జిల్లాలో వానాకాలం ధాన్యం కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయి. గతంలో విక్రయించిన ధాన్యానికి బోనస్ ఇంకా జమ కాకపోవడంతో రైతుల్లో గందరగోళం నెలకొంది. మద్దతు ధరతో పాటు బోనస్ రావాలంటే కొనుగోలు కేంద్రాల్లోనే అమ్మాల్సి ఉన్నా, బోనస్‌పై అనుమానంతో రైతులు ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకోవడానికి మొగ్గు చూపుతున్నారు.


