News December 12, 2025

భారీ జీతంతో 340 ఉద్యోగాలు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

image

ఎయిర్‌ఫోర్స్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2026కు దరఖాస్తు చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. దీని ద్వారా 340 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇంటర్, డిగ్రీ/BE, బీటెక్ పాసైన వారు అప్లై చేసుకోవచ్చు. వయసు 20-26ఏళ్లు ఉండాలి. రాత, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్టుల ఆధారంగా ఎంపిక ఉంటుంది. ట్రైనింగ్‌లో ₹56,100, ఆ తర్వాత ₹1,77,500 వరకు జీతం ఉంటుంది. వెబ్‌సైట్: afcat.cdac.in/* మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.

Similar News

News December 12, 2025

నరసాపురం నుంచి వందేభారత్

image

నరసాపురం – చెన్నైకి వందేభారత్ నడిచేందుకు ఈ నెల 15 న ముహూర్తం ఖరారయింది. ప.గో నుంచి ఇదే తొలిసారి కావడంతో అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ చేతుల మీదుగా ప్రారంభం కానుంది. ఈ రైలు నరసాపురం – విజయవాడ మధ్య నరసాపురం, భీమవరం, గుడివాడలో ఆగుతుంది. కాగా ఇది నరసాపురంలో మ. 2.50కి బయలుదేరి రాత్రి 11.45కు చెన్నైకి చేరుతుంది. తిరిగి ఉ. 5.35కు బయలుదేరి మ.2.10కి నరసాపురంలో ఉంటుంది.

News December 12, 2025

జపాన్‌లో మళ్లీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ

image

జపాన్‌లో వరుస <<18509568>>భూకంపాలు<<>> ప్రజలను హడలెత్తిస్తున్నాయి. ఇవాళ 6.7 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు అధికారులు తెలిపారు. ఉత్తర పసిఫిక్ తీరప్రాంతంలో సునామీ అలలు మీటర్ ఎత్తులో ఎగసిపడొచ్చని హెచ్చరించారు. కుజి నగరానికి 130 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు వెల్లడించింది. కాగా నాలుగు రోజుల కిందట ఇదే ప్రాంతంలో వచ్చిన భూకంపానికి పలు ఇళ్లు బీటలు వారగా 50 మంది గాయపడ్డారు.

News December 12, 2025

బస్సు ప్రమాదంపై PM దిగ్భ్రాంతి.. పరిహారం ప్రకటన

image

AP: అల్లూరి జిల్లా బస్సు <<18539495>>ప్రమాదంలో<<>> ప్రాణనష్టం సంభవించడం చాలా బాధాకరమని ప్రధాని మోదీ అన్నారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50,000 చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. కాగా ఈ ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని ప్రాథమికంగా నిర్ధారించినట్లు పోలీసులు తెలిపారు.