News January 5, 2026
భారీ జీతంతో RBIలో ఉద్యోగాలు

<
Similar News
News January 6, 2026
బంగ్లాదేశ్ హిందూ క్రికెటర్‌ను కెప్టెన్ చేసింది: జేడీయూ నేత

బంగ్లాదేశ్ క్రికెటర్ ముస్తాఫిజుర్‌ను KKR జట్టు నుంచి <<18748860>>తొలగించడాన్ని<<>> JDU నేత KC త్యాగి తప్పుబట్టారు. ‘క్రీడలను రాజకీయాలు ప్రభావితం చేయకూడదు. బంగ్లాలో జరుగుతున్న వాటిపై మనం ఆందోళన చేస్తున్నాం. IPL నుంచి ఆ దేశ క్రికెటర్‌ను తొలగించాం. కానీ బంగ్లా జాతీయ జట్టుకు మైనారిటీ క్రికెటర్, హిందువు(లిటన్ దాస్)ను కెప్టెన్‌గా చేసింది. వాళ్లు బలమైన సందేశం పంపారు. మనం పునరాలోచించాలి’ అని చెప్పారు.
News January 6, 2026
ఈ చీర ధర 39 లక్షలు.. ప్రత్యేకతలివే..

చెన్నైకి చెందిన ప్రముఖ టెక్స్‌టైల్ సంస్థ 36 లక్షల రూపాయల ఖరీదైన చీరను తయారు చేసింది. దీన్ని డబుల్ వార్ఫ్ పద్ధతిని ఉపయోగించి చేతితో నేశారు. 64 రంగుల షేడ్స్, పది ప్రత్యేకమైన డిజైన్లు ఉండే ఈ చీర బరువు 8కేజీలు. 59.7 గ్రాముల బంగారం, 3.9 క్యారెట్ల వజ్రం, 5 క్యారెట్ల నీలమణిని వినియోగించారు. అంత విలువైన వజ్రాలు, కళాఖండాలకు నిలయం కావడంతోనే ఈ చీర గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకుంది.
News January 6, 2026
ఈ నెల 19న దావోస్‌కు సీఎం రేవంత్: మంత్రి

TG: ఈ నెల 19న సీఎం రేవంత్ రెడ్డి దావోస్ వెళ్తారని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఈ నెల 23 వరకు జరగబోయే వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్(WEF)లో పాల్గొంటారని చెప్పారు. తెలంగాణ పాలసీ విధానాలను అక్కడికి వచ్చే పారిశ్రామికవేత్తలకు వివరిస్తారని పేర్కొన్నారు. కాగా ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో రూ.5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని మంత్రి వెల్లడించారు.


