News September 12, 2025

భార్యను హత్య చేసిన భర్తకు రిమాండ్

image

శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరులోని ఎస్సీ కాలనీలో ఆదివారం రాత్రి మద్యం మత్తులో భార్య లక్ష్మిదేవిని గొడ్డలితో హత్య చేసిన రాఘవేంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం అతడిని కోర్టులో హాజరు పరచగా జడ్జి 14 రోజుల రిమాండ్‌ విధించారు. దీంతో జైలుకు తరలించినట్టు ఎస్ఐ మునీర్ అహ్మద్ తెలిపారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందన్నారు.

Similar News

News September 12, 2025

సంగారెడ్డి: 15న జిల్లా స్థాయి సైన్స్ సెమినార్

image

సంగారెడ్డి జిల్లా కేంద్రంలోనీ సైన్స్ సెంటర్లో ఈనెల 15న జిల్లా స్థాయి సైన్స్ సెమినార్ నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సెమినార్‌కు 8 నుంచి 10 వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు. క్వాంటమ్ యుగం ప్రారంభం, సంభావ్యతలు, సవాళ్లు అనే అంశంపైన సెమినార్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

News September 12, 2025

నల్గొండ: ఉద్యోగాలకు సాధనకు 15న ఆమరణ నిరాహార దీక్ష

image

రెండు లక్షల ఉద్యోగాల సాధనకు ఈనెల 15న ఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు నిరుద్యోగుల హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు పాలకూరి అశోక్ కుమార్ గౌడ్ తెలిపారు. ఆమరణ నిరాహార దీక్షకు సంబంధించిన వాల్ పోస్టర్లను హైదరాబాద్‌లో గురువారం ఎంపీ ఆర్ కృష్ణయ్యతో కలిసి ఆవిష్కరించారు. అశోక్ కుమార్ మాట్లాడుతూ.. నిరాహార దీక్షకు పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరూ మద్దతు ప్రకటించాలని కోరారు.

News September 12, 2025

OTTలోకి వచ్చేసిన అనుపమ ‘పరదా’

image

అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన ‘పరదా’ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా తెలుగు, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. రాగ్ మయూర్, గౌతమ్ మేనన్, సంగీత, దర్శన రాజేంద్రన్ ప్రధాన పాత్రలు పోషించారు. గోపీ సుందర్ మ్యూజిక్ అందించారు. ఆగస్టు 22న ఈ మూవీ థియేటర్లలో విడుదలైంది.