News January 19, 2026
భార్యాభర్తలకు ఒకే ITR.. బడ్జెట్‌లో ప్రకటన?

బడ్జెట్ 2026లో మ్యారీడ్ కపుల్ కోసం ఆప్షనల్ జాయింట్ టాక్సేషన్ విధానాన్ని తీసుకురావాలని కేంద్రం ఆలోచిస్తున్నట్లు సమాచారం. దీని ప్రకారం భార్యాభర్తలను ఒకే ఆర్థిక యూనిట్‌గా పరిగణించి ఉమ్మడి ఆదాయంపై పన్ను లెక్కిస్తారు. ఈ విధానం వస్తే దంపతుల ఉమ్మడి పన్ను మినహాయింపు పరిమితి పెరుగుతుంది. విడివిడిగా కాకుండా ఒకే ITR ఫైల్ చేయొచ్చు. ఇది ముఖ్యంగా మధ్యతరగతి, సింగిల్ ఇన్‌కమ్ కుటుంబాలకు భారీ ఊరటనిస్తుంది.
Similar News
News February 16, 2026
ఎవరు ఎవరికి ‘బి టీమ్’?

TG: రాష్ట్రంలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, BRS, BJP ఎప్పటి నుంచో పరస్పరం ‘బి టీమ్’ ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఇటీవల వాలంటైన్స్ డే సందర్భంగానూ ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్నాయి. కానీ ఇవాళ మేయర్, ఛైర్మన్ల ఎన్నిక వేళ పార్టీల అసలు ‘రంగు’ బయటపడింది. పదవులు దక్కించుకునేందుకు కామారెడ్డిలో కాంగ్రెస్, BRS కలవగా, అమరచింతలో BRS-BJP ఒక్కటయ్యాయి. దీంతో ఎవరు ఎవరికి ‘బి టీమ్’ అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
News February 16, 2026
ఆర్థికంగా మెరుగుపడాలంటే ఈ తప్పులు వద్దు

‘ఇంట్లో శుభం కలగాలంటే ముఖద్వారం శుభ్రంగా ఉండాలి. ప్రధాన ద్వారం వద్ద చెప్పులు, షూలు వదలకూడదు. తద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గుతుంది. ఆర్థిక ఇబ్బందులు కలగవచ్చు. ద్వారం వద్ద రాహువు ప్రభావం అధికంగా ఉంటుంది. కాబట్టి అక్కడ గజిబిజిగా ఉంచకూడదు. షూ రాక్ ఉంచడం ఉత్తమం. ఇంట్లో అన్ని వస్తువులు పద్ధతిగా అమర్చుకోవాలి. అప్పుడే ఇంట్లో సానుకూల శక్తి ప్రవహించి, సుఖసంతోషాలు కలుగుతాయి’ అంటున్నారు వాస్తు నిపుణులు.
News February 16, 2026
బనారస్ హిందూ యూనివర్సిటీలో ఫ్యాకల్టీ పోస్టులు

<


