News January 30, 2026

భార్యాభర్తలకు గ్రూప్-2 ఉద్యోగాలు

image

బనగానపల్లె మండలం టంగుటూరు గ్రామానికి చెందిన దంపతులు బాణా విజయచంద్రా రెడ్డి, శరణ్య గ్రూప్-2 ఫలితాల్లో విజయం సాధించారు. సామాన్య వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వీరు కష్టపడి తమ కలలను నెరవేర్చుకున్నారు. ప్రస్తుతం రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న శరణ్య ఏఎస్ఓ (ASO)గా ఎంపిక కాగా, భర్త విజయచంద్రా రెడ్డి సైతం అదే ఉద్యోగం సాధించారు. వీరిని కుటుంబ సభ్యులు, గ్రామస్థులు అభినందించారు.

Similar News

News February 20, 2026

హెరిటేజ్, ఇందాపూర్ డెయిరీపై వైసీపీ ఆరోపణలేంటి?

image

AP: ‘హెరిటేజ్‌’కు పుణే(MH)లోని ఇందాపూర్ డెయిరీ అనుబంధ సంస్థ అని YCP ఆరోపిస్తోంది. 2015లో అది TTDకి నెయ్యి సరఫరా చేసిందని, నాణ్యత లేకపోవడంతో అనర్హత వేటు వేశారని <<19186015>>జగన్<<>> చెబుతున్నారు. అప్పుడే కల్తీ జరిగితే తమపై ఆరోపణలేంటని ప్రశ్నిస్తున్నారు. అయితే ‘ఇందాపూర్’ తమ అనుబంధ సంస్థ కాదని, అక్కడి నుంచి చీజ్ మాత్రమే కొంటామని హెరిటేజ్ స్పష్టం చేసింది. తాము అసలు TTDకి నెయ్యి సరఫరా చేయలేమని పేర్కొంది.

News February 20, 2026

NZB: నేడు బాధ్యతలు స్వీకరించనున్న మేయర్

image

నిజామాబాద్ నగర మేయర్‌గా ఇటీవల ఎన్నికైన కూరగాయల ఉమారాణి శుక్రవారం ఉదయం 11.30 గంటలకు పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారని నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ తెలిపారు. నగర పాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించనున్న కార్యక్రమానికి కార్పొరేటర్లు విచ్చేయాలని కమిషనర్ కోరారు.

News February 20, 2026

HYD: 60% వరకు రాయితీతో బైకులు

image

PM మత్స్య సంపద యోజన కింద HYD జిల్లాలో అర్హతగల మత్స్యకారులకు 16 బైకులు (ఐస్ బాక్స్‌తో) మంజూరు చేసినట్లు జిల్లా మత్స్యశాఖాధికారి రజిని తెలిపారు. ఒక్క యూనిట్ విలువ రూ.75,000 అని స్పష్టంచేశారు. జనరల్‌, SC/STలకు 40% (రూ.30వేలు), మహిళలకు 60% (రూ.45వేలు) రాయితీ ఉంటుంది. చేపల అమ్మకంలో అనుభవం, డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి. ఆసక్తిగల వారు ఫిబ్రవరి 26లోగా మాసబ్‌ట్యాంక్‌ మత్స్యభవన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.