News November 3, 2024
భార్యాభర్తలను అరెస్ట్ చేసిన మంచిర్యాల పోలీసులు
మ్యాట్రిమోనీ పేరుతో సైబర్ నేరాలకు పాల్పడుతున్న భార్యాభర్తలను అరెస్ట్ చేసినట్లు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ SHO DSP వెంకటరమణ తెలిపారు. మంచిర్యాల జిల్లాకు చెందిన ఒక వ్యక్తి సైబర్ నేరగాళ్ల చేతిలో రూ.17లక్షలు మోసపోయారన్నారు. దీంతో బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఏలూరు జిల్లాకు చెందిన వెంకట నాగరాజు, సౌజన్యలను అరెస్ట్ చేసినట్లు DSP వెల్లడించారు.
Similar News
News November 22, 2024
నిర్మల్: నవజాత శిశువుకు అరుదైన శస్త్ర చికిత్స
ప్రాణాపాయ స్థితిలో ఉన్న నవజాత శిశువుకు వైద్యులు ఆపరేషన్ విజయవంతంగా చేసి పాప ప్రాణాలు కాపాడిన ఘటన గురువారం నిర్మల్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో జరిగింది. వైద్యులు సంతోష్ రాజ్ మాట్లాడుతూ.. ఇచ్చోడ మండలానికి చెందిన ఓ గర్భిణి నవజాత శిశువుకు జన్మనిచ్చింది. అన్నవాహికకు జీర్ణాశయానికి సంబంధం లేకపోవడంతో ప్రాణాపాయ స్థితిలో ఉండగా ఆపరేషన్ చేసి ప్రాణాలు కాపాడినట్లు డాక్టర్ తెలిపారు.
News November 22, 2024
విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించాలి: ADB కలెక్టర్
పది, ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశాన్ని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షిషా గురువారం నిర్వహించారు. పదో తరగతలో ప్రత్యేక తరగతులు నిర్వహించి డిసెంబర్ నాటికి సబ్జెక్టుల వారీగా సిలబస్ పూర్తి చేసి జనవరి నుంచి 2025 రివిజన్ చేపట్టాలని సూచించారు. ఇంటర్మీడియట్‌లో మెరుగైన ఫలితాలు సాధించాలన్నారు. వెనుకబడిన విద్యార్ధులపై ప్రత్యేక శ్రద్ద వహించాలని అధికారులకు సూచించారు.
News November 21, 2024
ADB: రిమ్స్ అభ్యర్థుల ప్రొవిజినల్ మెరిట్ లిస్టు విడుదల
ఆదిలాబాద్ రిమ్స్‌లో డిప్లొమా ఇన్ ఆప్తల్మిక్ అసిస్టెంట్, డిప్లొమా ఇన్ మెడికల్ ఇమేజింగ్ టెక్నాలజీ కోర్సుల్లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ప్రొవిజినల్ మెరిట్ లిస్టును విడుదల చేసినట్లు డైరెక్టర్ జైసింగ్ తెలిపారు. లిస్ట్‌ను నోటీస్ బోర్డుపై ఉంచామాన్నారు. ఎమైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 22న రిమ్స్ ఆఫీసులో సంప్రదించాలని, లిస్టులో ఉన్న అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్స్‌తో ఈ నెల 23న హాజరు కావాలన్నారు.