News September 15, 2025

భార్యాభర్తలు.. ఇద్దరూ కలెక్టర్లే

image

ఏపీ చ‌రిత్ర‌లో అరుదైన ఘటన చోటుచేసుకుంది. నెల్లూరు జిల్లా క‌లెక్ట‌ర్‌గా హిమాన్ష్‌శుక్లా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేపట్ట‌గా ఆయ‌న స‌తీమ‌ణి కృతికాశుక్లా కూడా నిన్నే ప‌ల్నాడు జిల్లా క‌లెక్ట‌ర్‌గా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టారు. 2013 బ్యాచ్‌కు చెందిన ఈ భార్యాభ‌ర్త‌లు ఒక‌రు ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌కు చెందిన వారు కాగా మ‌రొక‌రు హ‌ర్యానాకు చెందిన వారు. ఇద్ద‌రూ కుటుంబంతోపాటు వెళ్లి బాధ్యతలు స్వీకరించారు.

Similar News

News September 15, 2025

HNK: ఆర్ట్ అండ్ సైన్స్ కళాశాలలో మెగా జాబ్ ఫెయిర్

image

ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ట్రైనింగ్ & ప్లేస్మెంట్ సెల్.. భౌతికశాస్త్ర విభాగం సహకారంతో మెగాజాబ్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ ప్రొ.జ్యోతి తెలిపారు. సాఫ్ట్ స్కిల్స్, ఇంటర్వ్యూ నైపుణ్యాల ఆధారంగా మంగళవారం నుంచి 3 రోజులపాటు శిక్షణ తరగతులను నిర్వహించిన అనంతరం 19వ రిక్రూట్మెంట్ డ్రైవ్ ఉంటుందన్నారు. రిజిస్ట్రేషన్ కోసం ఎల్.జితేందర్ 9849673244ను సంప్రదించాలన్నారు.

News September 15, 2025

ప్రజా ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలి: కలెక్టర్

image

కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు సమర్పించిన వినతులను వరంగల్ కలెక్టర్ సత్యశారద స్వయంగా స్వీకరించి పరిష్కార నిమిత్తం ఆయా శాఖల అధికారులకు అందజేశారు. నేటి ప్రజావాణి కార్యక్రమానికి 166 ఫిర్యాదులు రాగా, అధికంగా రెవెన్యూ సమస్యలు 72, జీడబ్ల్యూ ఎంసీ 20, గృహ నిర్మాణ శాఖ 11, విద్యా శాఖ 9, డీఆర్డీవో 7, ఇతర శాఖలకు సంబంధించిన 47 ఫిర్యాదులు వచ్చాయి.

News September 15, 2025

నిజాంసాగర్: 5 గేట్లు ఎత్తివేత

image

నిజాంసాగర్ ప్రాజెక్టు 5 గేట్లు ఎత్తి 33,910 క్యూసెక్కుల నీటిని మంజీరాకు విడుదల చేసినట్లు ప్రాజెక్టు ఏఈఈ అక్షయ్ సోమవారం రాత్రి తెలిపారు. ప్రాజెక్టులోకి 38,829 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తున్నట్లు చెప్పారు. దీంతో ప్రస్తుతం ప్రాజెక్టులో 17.397 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రధాన కాలువకు 1,000 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతోంది.