News September 13, 2025
భార్య కాపురానికి రావడంలేదని హైటెన్షన్ టవర్ ఎక్కిన భర్త

పి.గన్నవరం మండలం జొన్నలంకకు చెందిన పెసంగి సాయిబాబు అనే వ్యక్తి శనివారం పి.గన్నవరం వద్ద ఉన్న హై-టెన్షన్ విద్యుత్ టవర్ ఎక్కాడు. భార్యాభర్తల మధ్య స్వల్ప వివాదం కారణంగా సాయిబాబు భార్యను ఆమె బంధువులు పుట్టింటికి తీసుకెళ్లారని, ఆమెను తిరిగి తన వద్దకు పంపించాలని డిమాండ్ చేశాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, అతనికి నచ్చజెప్పి సురక్షితంగా కిందకు దించారు.
Similar News
News September 13, 2025
కొయ్యలగూడెం: వర్జినియా పొగాకు రికార్డు ధర

వర్జినియా పొగాకు ధర ఆల్ టైం రికార్డు సృష్టించింది. కొయ్యలగూడెం వేలం కేంద్రంలో శనివారం జరిగిన కొనుగోళ్లలో కేజీ రూ.430కి చేరింది. దాదాపు 60 సంవత్సరాల వర్జినియా చరిత్రలో ఇదే అత్యధిక ధర అని తెలుస్తోంది. రెండు రోజుల వ్యవధిలో రూ.35 పెరగడం నమ్మలేని విషయమని రైతాంగం చెబుతోంది. కొనుగోళ్లు ప్రక్రియ ముగుస్తున్న సమయాల్లో ధర పెరుగుదల సాధారణమే అయినప్పటికీ ఇంత వేగంగా పెరగడం అరుదని వారు అంటున్నారు.
News September 13, 2025
కృష్ణా జలాల్లో 71% వాటా డిమాండ్ చేస్తున్నాం: ఉత్తమ్

TG: నదీ జలాల వాటా సాధనలో రాష్ట్ర ప్రయోజనాలకు కట్టుబడి ఉన్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. 811 TMCల కృష్ణా జలాల్లో 71% డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. చుక్కనీటిని వదులుకునే ప్రసక్తి లేదని తేల్చిచెప్పారు. ఈ నెల 23న ఢిల్లీలో జరిగే కృష్ణా ట్రిబ్యునల్-2 సమావేశంలో బలంగా వాదిస్తామన్నారు. గత పాలకుల ఉదాసీనత వల్ల ఏపీ అక్రమంగా నీటిని తరలించుకొని ప్రయోజనం పొందిందని విమర్శించారు.
News September 13, 2025
ప్రకాశం జిల్లా నూతన SP నేపథ్యం ఇదే.!

ప్రకాశం జిల్లాకు <<17699232>>SPగా వి హర్షవర్ధన్ రాజు<<>> నియమితులైన విషయం తెలిసిందే. నెల్లూరు జిల్లాలోని కావలికి చెందిన ఈయన అనంతపురం JNTUలో బీ.టెక్ పూర్తి చేశారు. 2013లో రాష్ట్ర పోలీసు సేవల్లో చేరారు. విజయవాడలో DCP, అన్నమయ్య, కడప జిల్లాల SP, విజయవాడలో CID SP, ఎర్రచందనం టాస్క్ ఫోర్స్ ఎస్పీగా కీలక పదవుల్లో ఆయన పనిచేశారు. తిరుపతి ఎస్పీగా పనిచేస్తూ.. ప్రకాశం జిల్లాకు బదిలీ అయ్యారు.