News December 4, 2024
భార్య హత్య.. ముగ్గురికి ఏడేళ్లు జైలు
భార్యను చంపిన ఘటనలో భర్తతోపాటూ మరో ఇద్దరికి ఏడేళ్లు జైళు శిక్ష విధిస్తూ జడ్జి గీత తీర్పు చెప్పారు. కృష్ణా జిల్లాకు చెందిన విజయలక్ష్మికి ముత్తుకూరు గొల్లపూడి విజయకృష్ణతో 2014లో వివాహం అయింది. కట్నం కింద రూ.4లక్షలు, కొంత బంగారం ఇచ్చారు. అదనపు కట్నం కోసం భర్త, ఆడపడుచు, అత్త విజయలక్ష్మిని వేధిస్తూ.. కిరోసిన్ పోసి నిప్పు అంటించడంతో ఆమె చనిపోయింది. ఘటనపై విచారణ చేసిన జడ్జి ముగ్గురికి శిక్ష ఖరారు చేశారు.
Similar News
News December 4, 2024
అల్లూరు: దెయ్యం పేరుతో బురిడీ
అల్లూరు మండలంలో ముగ్గురు వ్యక్తులు ఓ స్వామి మాల ధరించి ఒక వ్యక్తి దగ్గర నుంచి బంగారు నగలు అపహరించారు. అమాయక ప్రజలే టార్గెట్‌గా చేసుకొని ఇంట్లో దెయ్యం ఉందని నమ్మించారు. పూజలు చేస్తే దెయ్యం వెళ్లిపోతుందన్నారు. అనంతరం బాధితుడి నుంచి బంగారు నగలు అపహరించుకొని వెళ్లిపోయారు. దీంతో బాధితుడు స్థానిక అల్లూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
News December 4, 2024
మత్స్యకారుల సంక్షేమానికి తీసుకుంటున్న చర్యలేంటి: ఎంపీ వేమిరెడ్డి
దేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మత్స్యకారుల సంక్షేమానికి కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వివరించాలని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి బుధవారం కోరారు. లోక్‌సభలో ఆయన మత్స్యకారుల సంక్షేమానికి సంబంధించి పలు ప్రశ్నలు వేశారు. ఆంధ్రప్రదేశ్‌లో మత్స్యకారుల నైపుణ్యాభివృద్ధికి, శిక్షణ అందించడానికి ప్రభుత్వం ఏదైనా పథకాలను అమలు చేస్తుందా అని ప్రశ్నించారు.
News December 4, 2024
కొండాపురం; 30 మంది సచివాలయం సిబ్బందికి మెమోలు
కొండాపురం మండలంలో పనిచేసే 30 మంది సచివాలయం సిబ్బందికి ఎంపీడీవో ఆదినారాయణ బుధవారం మెమోలు ఇచ్చారు. దీంతో సచివాలయ ఉద్యోగుల్లో కలకలం రేగింది. సచివాలయాల్లో తనిఖీలు నిర్వహించిన ఎంపీడివో పలు విషయాలను గుర్తించినట్లు తెలిపారు. మెమోలిచ్చిన వారంతా సచివాలయాల విధులకు సక్రమంగా హాజరు కావడం లేదని గుర్తించినట్లు పేర్కొన్నారు. వీరు ఇదేవిధంగా ప్రవర్తిస్తే ఉన్నతాధికారులకు తెలిపి చర్యలు తీసుకుంటామని చెప్పారు.