News November 20, 2025
భిక్కనూర్: బొట్టు పెట్టి చీరలు అందజేయాలి: మంత్రి

భిక్కనూర్‌లో గురువారం మంత్రి సీతక్క ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమన్ని ప్రారంభించారు. ప్రతి లబ్ధిదారురాలికి తప్పనిసరిగా చీర అందేలా ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేయాలని ఆదేశించారు. గ్రామ స్థాయిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలన్నారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి బొట్టు పెట్టి, చీరలను గౌరవప్రదంగా అందజేయాలని సూచించారు.
Similar News
News November 23, 2025
పురుషార్థాలు సిద్ధింపజేసే విష్ణు శ్లోకం

యాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మనః |
ఋషిభిః పరిగీతాని తాని వక్ష్యామి భూతయే ||
విష్ణు సహస్ర నామాలు ముఖ్యమైనవి మాత్రమే కాదు. ఇవి అసాధారణమైనవి. ఎందరో రుషులు వీటిని గానం చేశారు. కీర్తించారు. అంతటి మహిమాన్విత నామాలను పఠించడం లేదా వినడం వల్ల పరమ ప్రయోజనాలు, పురుషార్థాలు సిద్ధిస్తాయి. ఇవి లోకానికి శుభాన్ని, భగవంతుని అనుగ్రహాన్ని చేకూర్చడానికి ఉపక్రమిస్తున్నాయి. <<-se>>#VISHNUSAHASRANAMAM<<>>
News November 23, 2025
యథావిధిగా అమలాపురంలో ‘పీజీఆర్‌ఎస్’ : కలెక్టర్

ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ఈ నెల 24 సోమవారం అమలాపురం కలెక్టరేట్‌లో యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ మహేశ్ కుమార్ ఆదివారం తెలిపారు. జిల్లా స్థాయిలో కలెక్టరేట్‌లో, అలాగే ఆర్డీవో కార్యాలయాలు, మండల స్థాయిలో ఎంపీడీవో, తహశీల్దార్ కార్యాలయాల్లోనూ ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. ఫిర్యాదుదారులు తమ సమస్యలను అధికారుల దృష్టికి తెచ్చి పరిష్కరించుకోవాలని కలెక్టర్ కోరారు.
News November 23, 2025
KMR: రైలు ఢీకొని 80 గొర్రెల మృతి.. కాపరి గల్లంతు

కామారెడ్డి రైల్వే ట్రాక్ సమీపంలో ఆదివారం రైలు ఢీకొని సుమారు 80 గొర్రెలు మృతి చెందాయి. రైలు రాకను గమనించి వాటిని కాపాడుకునే ప్రయత్నంలో గొర్రెల కాపరి సురేష్ పెద్ద వాగులోకి దూకారు. అయితే, ఆయనతో పాటు ఉన్న మరో కాపరి, 35 ఏళ్ల ధర్షపు సుధాకర్, ఈత రాకపోవడంతో వాగులో గల్లంతయ్యారు. సుధాకర్ ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. పోలీసులు, రెస్క్యూ సిబ్బంది గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


