News March 13, 2025
భీంగల్: గ్రూప్-1 ,గ్రూప్- 2లో సత్తా చాటిన ఎక్సైజ్ SI

నిజామాబాద్ జిల్లా భీంగల్ లో ఎక్సైజ్ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న కార్గాం గోవర్ధన్ ఇటీవల విడుదలైన గ్రూప్-1 , గ్రూప్-2 ఫలితాల్లో సత్తా చాటారు. గ్రూప్-2లో 394.5 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో 88వ ర్యాంకు, బాసర జోన్‌లో 7వ ర్యాంకు సాధించాడు. ఈయన స్వగ్రామం నిర్మల్ జిల్లా కుంటాల మండలం. గ్రూప్-1 లో 421 మార్కులు సాధించి జిల్లా స్థాయి అధికారి పోస్ట్ కొరకు వేచి చూస్తుండటం విశేషం.
Similar News
News September 15, 2025
చిత్తూరు SPగా తుషార్ డూడీ బాధ్యతలు

చిత్తూరు జిల్లా 68వ SPగా తుషార్ డూడీ జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఆయనకు పలువురు అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని నూతన ఎస్పీ తెలిపారు. గతంలో ఉన్న ఎస్పీ మణికంఠ స్థానంలో బాపట్ల నుంచి ఈయన బదిలీపై వచ్చారు.
News September 15, 2025
NLG: 17 నుంచి పోషణ మాసం షురూ

ఆరోగ్యకర సమాజ నిర్మాణంతో పాటు మాతా శిశు సంరక్షణ కోసం అధికారులు పోషణ మాసం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పోషణ్ అభియాన్ ప్రజల భాగస్వామ్యంతో నడిచే ఉద్యమంగా భావించి జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ నల్గొండ జిల్లాలోని 2,093 అంగన్వాడి కేంద్రాల్లో ఈనెల 17వ తేదీ నుంచి అక్టోబర్ 16వ తేదీ వరకు పోషణ మాసం నిర్వహించనుంది. అంగన్వాడి కేంద్రాల్లో పిల్లల ఎత్తు, బరువు చూసి రిజిస్టర్లో నమోదు చేయనున్నారు.
News September 15, 2025
సంగారెడ్డి జిల్లాలో గేమ్స్ వాయిదా

సంగారెడ్డి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఈ నెల 16, 17న జరగాల్సిన జిల్లా స్థాయి కబడ్డీ పోటీలను వాయిదా వేసినట్లు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి శ్రీనివాసరావు తెలిపారు. పోటీలు నిర్వహించాల్సిన మైదానాలు వర్షం నీటితో నిండిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని, త్వరలో కొత్త తేదీలను ప్రకటిస్తామని వెల్లడించారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.