News March 13, 2025
భీంగల్: గ్రూప్-1 ,గ్రూప్- 2లో సత్తా చాటిన ఎక్సైజ్ SI

నిజామాబాద్ జిల్లా భీంగల్ లో ఎక్సైజ్ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న కార్గాం గోవర్ధన్ ఇటీవల విడుదలైన గ్రూప్-1 , గ్రూప్-2 ఫలితాల్లో సత్తా చాటారు. గ్రూప్-2లో 394.5 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో 88వ ర్యాంకు, బాసర జోన్‌లో 7వ ర్యాంకు సాధించాడు. ఈయన స్వగ్రామం నిర్మల్ జిల్లా కుంటాల మండలం. గ్రూప్-1 లో 421 మార్కులు సాధించి జిల్లా స్థాయి అధికారి పోస్ట్ కొరకు వేచి చూస్తుండటం విశేషం.
Similar News
News March 14, 2025
భీమ్‌గల్: మహిళ ఆత్మహత్య

ఆత్మహత్య చేసుకోని మహిళ మృతి చెందిన ఘటన భీమ్‌గల్ మండలం చేంగల్‌లో చోటు చేసుకుంది. SI మహేశ్ ప్రకారం.. శారద అనే మహిళ కూతురితో చేంగల్‌లో నివాసం ఉంటుంది. భర్త చనిపోవడంతో ఇంటి బాధ్యతలు తానే చుసుకుంటోంది. కుటుంబ పోషణ కోసం చేసిన అప్పులు తీర్చలేక ఈ నెల 12న నాప్తలీన్ బాల్స్ మింగి ఆత్మహత్యకు పాల్పడింది. చికిత్స కోసం ఆర్మూర్ ఆస్పత్రిలో చేర్చగా ఈ నెల 13న మృతి చెందింది. కేసు నమోదు చేసినట్లు SI వెల్లడించారు.
News March 14, 2025
NZB: పసుపు బోర్డు ఎక్కడుందో నాకే తెలియదు: AMC ఛైర్మన్

జిల్లాలో ఏర్పాటు చేశామని చెబుతున్న పసుపు బోర్డు ఎక్కడ ఉంది నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ అయిన తనకే తెలియదని, ఇంకా రైతులకు ఎలా తెలుస్తుందని ఛైర్మన్ ముప్ప గంగారెడ్డి అన్నారు. గురువారం డీసీసీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో పసుపు బోర్డు అని ప్రైవేట్ హోటల్‌లో దానిని ప్రారంభించారని అందుకు రైతులను, మార్కెట్ కమిటీలను పిలువకుండా కేవలం పార్టీ కార్యకర్తలతో కార్యక్రమం చేయించారని విమర్శించారు.
News March 13, 2025
NZB: జిల్లా వ్యాప్తంగా నిరసనలు, దిష్టిబొమ్మల దగ్ధం

జిల్లా వ్యాప్తంగా నిరసనలు, దిష్టిబొమ్మల దగ్ధం కార్యక్రమాలు శుక్రవరాం నిర్వహిస్తున్నామని పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొనాలని BRS పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పిలుపునిచ్చారు. BRS ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డిని బడ్జెట్ సమావేశాల సభ నుంచి సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు.