News September 8, 2024

భీంపూర్: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

image

ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలానికి చెందిన ఓ వ్యక్తి మహరాష్ట్రలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. పిప్పలకోటికి చెందిన జానకొండ నారాయణ(38) గురువారం ఇంటి నుంచి వెళ్లి తిరిగిరాలేదు. కాగా ఇవాళ మహరాష్ట్రలోని అంబాడీ అడవుల్లో అతను కాలిబూడిదై కనిపించాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. ఎవరైనా హత్యా చేశారా.. అన్న కోణంలో దర్యాప్తు చేపట్టారు.

Similar News

News February 27, 2026

ఆదిలాబాద్: MAR 10న మెగా JOB మేళా..!

image

పోలీసుశాఖ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతతోపాటు ఆదివాసీ యువత అభివృద్ధి కోసం MAR 10న ఆదిలాబాద్ పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో మెగా JOB మేళా నిర్వహించనుండటం అభినందనీయమని జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. జాబ్ మేళా పోస్టర్లను గురువారం ఆయన ఆవిష్కరించారు. ఈ జాబ్ మేళాలో 50కిపైగా కంపెనీల ద్వారా 2వేలకుపైగా ఉద్యోగాలను కల్పించనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు. SHARE.

News February 26, 2026

‘బాల్యవివాహ రహిత జిల్లాగా నిలిపేందుకు పునరంకితం కావాలి’

image

ఆదిలాబాద్ జిల్లాను బాల్యవివాహ రహితంగా తీర్చిదిద్దేందుకు అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది సమన్వయంతో కృషి చేయాలని కలెక్టర్ రాజర్షిషా పిలుపునిచ్చారు. బాల్యవివాహ నిరోధక అధికారులకు నిర్వహించిన అభయ అవగాహన సదస్సును ఆయన ప్రారంభించారు. గ్రామ, పట్టణాలలో బాలల సంరక్షణ కమిటీలు ప్రతినెలా విధిగా సమావేశం నిర్వహించాలని ఆదేశించారు. బాల్యవివాహ రహిత జిల్లాగా నిలిపేందుకు ప్రతిఒక్కరూ పునరంకితం కావాలని కలెక్టర్ కోరారు.

News February 26, 2026

ఆదిలాబాద్‌లో SSC విద్యార్థులకు గ్రాండ్ ప్రాక్టీస్ టెస్టులు

image

ఆదిలాబాద్ జిల్లాలో పదో తరగతి విద్యార్థుల కోసం గ్రాండ్ టెస్టుల షెడ్యూల్‌ను జిల్లా విద్యాశాఖ విడుదల చేసింది. మార్చి 2 నుంచి 10 వరకు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. తెలుగు, హిందీ, ఇంగ్లిష్, గణితం, సైన్స్, సోషల్ సబ్జెక్టులకు ప్రత్యేక తేదీలను కేటాయించారు. ఈ పరీక్షల ద్వారా విద్యార్థులు పబ్లిక్ పరీక్షలకు మరింత మెరుగ్గా తయారవ్వాలనే ఉద్దేశంతో అధికారులు ఈ చర్యలు చేపట్టారు.