News November 15, 2025

భీమడోలు: ఏడేళ్లుగా పరారీ.. నిందితుడి అరెస్ట్

image

భీమడోలు మండలం పూళ్లలో 2007లో జరిగిన హత్య కేసులో గుడివాడకు చెందిన నిందితుడు స్టీవెన్‌ను పోలీసులు శుక్రవారం విజయవాడలో అదుపులోకి తీసుకున్నారు. స్టీవెన్ ఏడేళ్ల నుంచి పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన CI విల్సన్, SI మదీనా బాషా, హెడ్ కానిస్టేబుల్స్ శ్రీనివాసరావు, సురేష్‌ను SP ప్రతాప్ శివ కిషోర్ ప్రశంసించారు. నిందితుడిని కోర్టులో హాజరు పరిచామన్నారు.

Similar News

News November 15, 2025

MBNR: రోడ్డు ప్రమాదంలో మహిళా కూలీ దుర్మరణం

image

అడ్డాకుల మండలం రాచాల సమీపంలో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళా కూలీ మృతిచెందింది. స్థానికులు తెలిపిన వివరాలు.. చౌడాయపల్లికి చెందిన మహిళా కూలీలు ఆటోలో వస్తుండగా, ఎదురుగా వచ్చిన ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న కూలీ పద్మ(30) అక్కడికక్కడే మృతిచెందగా.. మరో మహిళ బురమ్మకు స్వల్ప గాయాలయ్యాయి. బైక్ నడుపుతున్న వినయ్‌కు తీవ్ర గాయాలు కాగా, చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

News November 15, 2025

ములుగు జిల్లా పోలీసుల అదుపులో అజాద్, అశోక్!?

image

మావోయిస్టు పార్టీ భద్రాద్రి కార్యదర్శి ఆజాద్, సి.కా.స ఆర్గనైజర్ అశోక్ ములుగు జిల్లా పోలీసులు అదుపులో ఉన్నట్లు సమాచారం. నాలుగు రోజుల క్రితం వీరిని పస్రా వద్ద అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. సరెండర్ అయ్యేందుకు వీరిద్దరూ బయటకు రాగా పోలీసులు మాటువేసి పట్టుకున్నట్లు సమాచారం. వీరికి ఎలాంటి హాని తలపెట్టవద్దని, కోర్టు ముందు హాజరు పర్చాలని పౌరహక్కుల సంఘం నాయకులు గడ్డం లక్ష్మణ్, నారాయణరావు డిమాండ్ చేశారు.

News November 15, 2025

విశాఖ పార్టీ కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించిన మంత్రి లోకేశ్

image

విశాఖ టీడీపీ కార్యాలయంలో మంత్రి నారా లోకేశ్ శనివారం ప్రజాదర్బార్ నిర్వహించారు. ప్రజల నుంచి ఆయన వినతులు స్వీకరించారు. వ్యవసాయ భూమిని కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారని విజయనగరానికి చెందిన బంగారి శ్రీనివాసరావు మంత్రి లోకేశ్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న తన కుమార్తెకు వైద్యసాయం అందించి ఆదుకోవాలని నెల్లూరుకు చెందిన కొప్పాల సుధాకర్ విజ్ఞప్తి చేశారు.