News August 28, 2024

భీమడోలు మండలంలో దారుణ హత్య

image

భీమడోలు మండలం అర్జవారిగూడెంలో బుధవారం దారుణ హత్య జరిగింది. కృష్ణను ఓ వ్యక్తి మెడపై కత్తితో దాడి చేసి చంపినట్లు స్థానికులు తెలిపారు. ఇదే దాడిలో ఓ వివాహితకు తీవ్ర గాయాలు కాగా, ఆమెను ఏలూరు ఆసుపత్రికి తరలించామన్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. స్థల వివాదం నేపథ్యంలో హత్య జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు.

Similar News

News September 16, 2025

ఆక్వా జోన్ సర్వేను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి: జేసీ

image

జిల్లాలో ఆక్వా జోన్ సర్వేను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం భీమవరం కలెక్టరేట్లో ఆక్వా జూన్ సర్వేపై జిల్లాలోని మత్స్య శాఖ అధికారులతో సమీక్షించారు. ఆక్వా జోన్ పరిధిలోనికి తీసుకురావడానికి భీమవరం, ఆకివీడు మండలాల నివేదికలు అందాల్సి ఉందని, మిగతా అన్ని మండలాల్లో సర్వేను పూర్తి చేసి నివేదికలను అందజేయడం జరిగిందన్నారు.

News September 16, 2025

పాలకొల్లు: స్కూలు బస్సు ఢీకొన్న ఘటనలో వ్యక్తి మృతి

image

పాలకొల్లులో సోమవారం బస్సు ఢీకొని తీవ్రంగా గాయపడిన పోడూరు మండలం పెనుమదం గ్రామానికి చెందిన ఏలూరి శ్రీను మృతి చెందాడు. శ్రీను తలకు తీవ్ర గాయం కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. కొబ్బరి వలుపు పని నిమిత్తం శ్రీను పాలకొల్లుకు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు ఎస్సై సుధాకర్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

News September 16, 2025

ఉమ్మడి ప.గో జిల్లాలో 1063 మందికి టీచర్ ఉద్యోగాలు

image

ఉమ్మడి ప.గో జిల్లాలో ఉపాధ్యాయ ఉద్యోగాలకు 1063 మందిని విద్యాశాఖ ఎంపిక చేసింది. ప్రభుత్వ, జడ్పీ, గిరిజన సంక్షేమ శాఖ, జువైనల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ల స్కూళ్లలో మొత్తంగా 1074 పోస్టులు నోటిఫై చేయగా.. వీటిలో 1063 పోస్టులకు మెరిట్ కమ్ రిజర్వేషన్ రోస్టర్ నిబంధనల మేరకు అభ్యర్థులను ఖరారు చేశారు. 11 పోస్టులకు అర్హులు లేకపోవడంతో వాటిని భర్తీ చేయలేదు. ఎంపికైన వారిలో 534 మంది పురుషులు, 529 మంది మహిళలున్నారు.