News February 14, 2025
భీమడోలు: యువకుడిని కాపాడిన పోలీసులు

కురెళ్ళగూడెంకి చెందిన ధనుష్ చేసిన అప్పులు తీర్చమని తండ్రి సీతారామయ్య పై ఒత్తిడి తెచ్చాడు. తండ్రి మందలించడంతో ధనుష్ వెళ్ళిపోయి వేరొక ప్రాంతం నుంచి తాను ఆత్మహత్య చేసుకోనున్నట్లు ఫోన్ ద్వారా తండ్రికి సమాచారం ఇచ్చాడు. తండ్రి పోలీసులను సంప్రదించారు . భీమడోలు ఎస్ఐ తన తోటి సిబ్బంది సహకారంతో ఆత్మహత్య ప్రయత్నం చేసుకుంటానన్న ధనుష్ ను గుర్తించారు. పోలీస్ స్టేషన్‌కి తీసుకొచ్చి కౌన్సిలింగ్ ఇచ్చారు.
Similar News
News February 28, 2026
సిద్దిపేట నుంచే కవిత కొత్త పార్టీ?

సిద్దిపేట కేంద్రంగా కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ ప్రకటన చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచే పోటీ చేయాలని ఆమె భావిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం సిద్దిపేటలో పార్టీ కార్యాలయం, నివాసం ఏర్పాటుకు స్థల పరిశీలన కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
News February 28, 2026
ఏలూరు: జిల్లా అధికారులతో ఎస్పీ సమీక్ష

ఏలూరు జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ, పెండింగ్‌లో ఉన్న కేసుల సత్వర పరిష్కారంపై ఎస్పీ ప్రతాప్ కిషోర్ శనివారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. తీవ్రమైన నేరాలు, మహిళలు, చిన్నారులపై జరిగిన దాడుల కేసుల్లో విచారణ ఏ దశలో ఉందో అడిగి తెలుసుకున్నారు. దర్యాప్తు పూర్తయిన కేసుల్లో వెంటనే ఛార్జ్ షీట్లను సిద్ధం చేసి, సంబంధిత న్యాయ స్థానాల్లో నిర్ణీత కాలవ్యవధిలో ఫైల్ చేయాలని స్పష్టం చేశారు.
News February 28, 2026
కామారెడ్డి జిల్లాలో 30, 30(ఏ) పోలీసు యాక్ట్ అమలు

కామారెడ్డి జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా వచ్చే నెల రోజుల పాటు 30, 30(ఏ) పోలీసు యాక్ట్ 1861 అమలులో ఉంటుందని ఎస్పీ రాజేశ్ చంద్ర శనివారం తెలిపారు. మార్చి 1 నుంచి మార్చి 31వ తేదీ వరకు ఈ నిబంధనలు జిల్లా వ్యాప్తంగా వర్తిస్తాయని ఆయన స్పష్టం చేశారు. పోలీసు అధికారుల ముందస్తు అనుమతి లేకుండా జిల్లాలో ఎలాంటి ధర్నాలు, రాస్తారోకోలు, నిరసన ప్రదర్శనలు నిర్వహించకూడదని వెల్లడించారు.


