News May 2, 2024

భీమదేవరపల్లి: ఎన్ కౌంటర్‌లో వంగర వాసి మృతి

image

ఛత్తీస్ ఘడ్‌లోని అబుజ్ మాడ్‌లో జరిగిన ఎన్ కౌంటర్‌లో భీమదేవరపల్లి మండలం వంగర గ్రామానికి చెందిన కాశవేణి రవి ఆలియాస్ వినయ్ మృతి చెందాడు. కాగా, 33 ఏళ్ల క్రితం తన తండ్రి ఉపాధి నిమిత్తం మంచిర్యాలలో ఉండగా.. మావోయిస్టుల్లో చేరిన అనంతరం రవి డీసీఎం స్థాయికి ఎదిగాడు. ఈ క్రమంలో ఎన్ కౌంటర్‌లో మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.

Similar News

News October 7, 2024

కేంద్ర మంత్రిని కలిసిన పెద్దపల్లి ఎంపీ

image

కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రి మనోహర్ కట్టర్‌ను సీఎం రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. సోమవారం తన పర్యటనలో భాగంగా డిల్లీలో మంత్రితో సీఎం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కొద్దిసేపు శాఖ సంబంధమైన విషయాలను వారిరువురు చర్చించారు. సీఎం వెంట పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రఘువీర్ రెడ్డి తదితరులున్నారు.

News October 7, 2024

బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూస్తాం: జగిత్యాల ఎస్పీ

image

జగిత్యాల జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ అశోక్‌ కుమార్ వివిధ ప్రాంతాల నుంచి సమస్యలతో వచ్చిన అర్జీదారులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారులు ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. ప్రజలకు పోలీస్ శాఖను మరింత చేరువ చేయడం లక్ష్యంగా ప్రజా సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తామని ఆయన తెలిపారు.

News October 7, 2024

ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లతో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అన్యాయం

image

హుస్నాబాద్: EWS రిజర్వేషన్ల వల్ల SC, ST, BC విద్యార్థులకు DSCలో తీవ్ర అన్యాయం జరిగిందని BC సంక్షేమ సంఘం జాతీయ నాయకుడు పిడిశెట్టి రాజు అన్నారు. సమాజంలో 6 శాతం ఉన్న ఉన్నత వర్గాలకు 10% రిజర్వేషన్లు ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు. జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.