News December 21, 2024
భీమవరంలో పలు రైస్ మిల్లు తనిఖీలు నిర్వహించిన కలెక్టర్
పీడీఎస్ బియ్యం అవకతవకలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు ఉంటాయని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి హెచ్చరించారు. శనివారం భీమవరం మండలం నరసింహపురం వద్ద పలు రైస్ మిల్లులను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై అధికారులు పాల్గొన్నారు.
Similar News
News December 30, 2024
చేబ్రోలు: ఆటో డ్రైవర్ కూతురు CAలో ఉత్తీర్ణత
ఏలూరు(D) చేబ్రోలుకి చెందిన పుట్టా వీరన్న, శ్రీదేవి దంపతుల కుమార్తె గీతాంజలి సీఏలో ఉత్తీర్ణత సాధించి అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. చేబ్రోలు, నారాయణపురంలో ప్రాథమిక విద్యాబ్యాసం సాగించిన గీతాంజలి.. ఇంటర్ అనంతరం CAలో ఉచిత సీటు సాధించారు. తండ్రి వీరన్న ఆటో డ్రైవర్‌గా కష్టపడుతూ గీతాంజలిని ఎంతగానో ప్రోత్సహిస్తూ వచ్చారు. పట్టుదలతో చదివిన గీతాంజలి సీఏ ఉత్తీర్ణత సాధించి తల్లిదండ్రులను గర్వపడేలా చేశారు.
News December 30, 2024
2024 ఎలక్షన్స్: ఉమ్మడి ప.గో నుంచి మంత్రి, డిప్యూటీ స్పీకర్
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయ ముఖచిత్రాన్ని 2024 ఎన్నికలు మార్చేశాయి. 2019 ఎన్నికల్లో జిల్లా నుంచి 13 నియోజకవర్గాల్లో YCP నెగ్గింది. కాగా ఈ ఎన్నికల్లో మొత్తం 15 నియోజకవర్గాల్లోనూ కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. 10 చోట్ల TDP, ఐదు స్థానాల్లో జనసేన విజయం సాధించాయి. పాలకొల్లు MLA నిమ్మల రామానాయుడు మంత్రి కాగా, రఘురామకృష్ణరాజు తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి డిప్యూటీ స్పీకర్ కావడం కొసమెరుపు.
News December 30, 2024
దేవరపల్లి: లారీని ఢీకొన్న ట్రావెల్స్ బస్సు.. తప్పిన పెను ప్రమాదం
దేవరపల్లి మండలంలోని డైమండ్ జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. వైజాగ్ నుంచి గుంటూరు వెళుతున్న ప్రైవేటు ట్రావెల్ బస్సు లారీను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. హైవే అంబులెన్స్‌లో క్షతగ్రాతులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 48 మంది ప్రయాణికులు ఉన్నట్లు చెబుతున్నారు.