News March 27, 2025
భీమవరంలో ప్రేమ పేరుతో మోసం

ప్రేమంటూ మోసం చేసిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. భీమవరం పట్టణానికి చెందిన ఓ యువతిని గుడిసె ఉదయ్ ప్రేమిస్తున్నానంటూ నమ్మించాడు. ఈక్రమంలో 2023 మేలో ఆమెను లోబర్చుకున్నాడు. అప్పటి నుంచి పెళ్లి చేసుకుంటానని చెబుతూ వచ్చాడు. ఇటీవల యువతి గట్టిగా నిలదీయడంతో పెళ్లి చేసుకోలేనని తెగేసి చెప్పాడు. ఈనెల 22న యువతి ఫిర్యాదు చేయగా.. ఉదయ్‌ను అరెస్ట్ చేశారు. రిమాండ్ నిమిత్తం తణుకు జైలుకు తరలించారు.
Similar News
News March 30, 2025
జైలులో మహిళా ఖైదీ సూసైడ్

ఏలూరు జిల్లా జైల్లో రిమాండ్‌లో ఉన్న శాంతికుమారి అనే మహిళా ఖైదీ బ్యారక్‌లో చున్నితో ఆత్మహత్య చేసుకుంది. ఆమెను చూసిన జైలు సిబ్బంది ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. శాంతి కుమారిది జీలుగుమిల్లి మండలం తాటాకులగూడెం. ప్రియుడితో కలసి భర్తను హత్య చేసిన ఆరోపణలతో ఈనెల 24న అరెస్ట్ చేశారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News March 30, 2025
భీమవరం: రేపు పీజీఆర్ కార్యక్రమం రద్దు

ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేసిట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ఈ నెల 31న రంజాన్ పండుగ కారణంగా రద్దు చేశామన్నారు. కలెక్టరేట్‌తో పాటు మండల స్థాయిలోనూ జరిగే కార్యక్రమాన్ని కూడా రద్దు చేసినట్లు పేర్కొన్నారు. ప్రజలు గమనించాలని కోరారు
News March 30, 2025
భీమవరం: అత్యాచారం చేసి బెదిరిస్తున్నాడని ఫిర్యాదు

తనను బెదిరించి అత్యాచారం చేశాడని భీమవరానికి చెందిన ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ నాగారాజు తెలిపిన వివరాల ప్రకారం.. యువతి ఉండే ప్రాంతానికి చెందిన అరుణ్ కుమార్ అనే వ్యక్తి బాధితురాలి ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి అతని భార్యపై గతంలో పెట్టిన కేసు వాపసు తీసుకోవాలని బెదిరించాడు. ఆపై అత్యాచారానికి పాల్పడినట్లు యువతి ఫిర్యాదు చేశారు. వీడియోలు తీసి బెదిరిస్తున్నాడని పేర్కొన్నారు. కేసు నమోదైంది.