News March 31, 2024
భీమవరంలో మావోయిస్టు అరెస్ట్

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఓ మావోయిస్టును పోలీసులు పట్టుకున్నారు. గతంలో ఝార్ఖండ్‌కు చెందిన నలుగురిని పోలీసులు అరెస్ట్ చేయగా.. రాహుల్ కేసరి అనే మావోయిస్టు తప్పించుకున్నాడు. కొద్దిరోజులు అతడు HYDలో తలదాచుకొని, 15 రోజుల కింద భీమవరం వచ్చి వలస కార్మికులతో తాపీ పనులు చేస్తున్నాడు. ఫోన్ ఆధారంగా భీమవరం వచ్చిన ఝార్ఖండ్ పోలీసులు అతడిని వలపన్ని పట్టుకున్నారు.
Similar News
News March 21, 2025
తానా సభలకు కేంద్రమంత్రి వర్మకు ఆహ్వానం

అమెరికాలో మిచ్ గన్‌లో జూలై 3,4,5 తేదీల్లో జరిగే తానా సభలకు కేంద్రమంత్రి వర్మను ఆహ్వానించారు. అసోసియేషన్ ఛైర్మన్ గంగాధర్ నాదెళ్ల, కార్యవర్గ సభ్యులు ఢిల్లీలో గురువారం కలిసి ఆహ్వానపత్రిక అందజేశారు. సభ్యులతో సమావేశమైన మంత్రి అసోసియేషన్ నిర్వహిస్తున్న కార్యక్రమాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. తానా కాన్ఫరెన్స్ డైరెక్టర్ సునీల్ పాంత్రా పాల్గొన్నారు.
News March 20, 2025
పారిశ్రామిక విధానాలపై ప.గో అధికారులకు అవగాహన

స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణాంధ్ర కలల సాకారంలో భాగంగా ప్లాస్టిక్, ఇతర వ్యర్థాల రీసైక్లింగ్ పరిశ్రమల స్థాపనకు ఔత్సాహికవేత్తలు కృషి చేయాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా పరిశ్రమలు,ఎగుమతి ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన వివిధ పారిశ్రామిక విధానాల గురించి అధికారులకు అవగాహన కల్పించారు.
News March 20, 2025
తాడేపల్లిగూడెం యువకుడిపై పోక్సో కేసు

తాడేపల్లిగూడేనికి చెందిన సత్య అనే యువకునిపై విశాఖలో పోక్సో కేసు నమోదైంది. విశాఖకు చెందిన 17 ఏళ్ల బాలిక డెంటల్ ఆస్పత్రిలో పనిచేస్తోంది. స్వీట్ షాపులో పనిచేస్తున్న సత్యతో పరిచయం ఏర్పడింది. ఈనెల 15న ఇంటి నుంచి వెళ్లిన బాలిక తిరగి రాలేదు. దీంతో ఆమె తల్లిదండ్రులు 4వ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇద్దరూ విజయవాడలో ఉన్నట్లు గుర్తించి పోలీసులు విశాఖ తీసుకోచ్చారు. సత్యపై పోక్సో కేసు నమోదు చేశారు.