News April 2, 2026

భీమవరంలో సంబరాలు

image

అమరావతికి రాష్ట్ర శాశ్వత రాజధానిగా చట్టబద్ధ గుర్తింపు లభించడంతో జిల్లావ్యాప్తంగా గురువారం పండుగ వాతావరణం నెలకొంది. భీమవరం జువ్వలపాలెం రోడ్డులోని అల్లూరి సీతారామరాజు స్మృతి వనం వద్ద నిర్వహించిన వేడుకల్లో కలెక్టర్ నాగరాణి పాల్గొన్నారు. తొలుత అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజధాని ఖరారు కావడంపై హర్షం వ్యక్తం చేస్తూ ఉత్సాహంగా వేడుకలు జరుపుకున్నారు.

Similar News

News April 7, 2026

ప.గో: తండ్రి మృతి, కొడుకు పరిస్థితి విషమం

image

కృత్తివెన్ను మండలం గరిసిపూడి వద్ద హైవేపై మంగళవారం విషాదం నెలకొంది. కారు, బైక్, వ్యాన్ మూడు వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న ప.గో (D) మొగల్తూరుకు చెందిన ఒడుగు బాల బాబూజీ (45) అక్కడికక్కడే మృతి చెందారు. ఆయన కుమారుడు కార్తీక్ (19) తీవ్రంగా గాయపడగా, పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను పోలీసులు ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News April 7, 2026

మొగల్తూరులో మద్యం మత్తులో దాడి.. ఇద్దరికి గాయాలు

image

మొగల్తూరు వైన్ షాపులో సోమవారం జరిగిన ఘర్షణలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. వైన్ షాప్ వద్ద మద్యం మత్తులో మోటూరి కిరణ్ అనే వ్యక్తి బీరు సీసాను పగులగొట్టి అక్కడే ఉన్న విల్లూరి కుమార్ బాబు, విల్లూరి సుగుణారావుపై తీవ్రంగా దాడి చేశాడు. బాధితులను వెంటనే నరసాపురం ఆసుపత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఎస్సై కె. నాగేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.