News March 30, 2025

భీమవరం: అత్యాచారం చేసి బెదిరిస్తున్నాడని ఫిర్యాదు

image

తనను బెదిరించి అత్యాచారం చేశాడని భీమవరానికి చెందిన ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ నాగారాజు తెలిపిన వివరాల ప్రకారం.. యువతి ఉండే ప్రాంతానికి చెందిన అరుణ్ కుమార్ అనే వ్యక్తి బాధితురాలి ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి అతని భార్యపై గతంలో పెట్టిన కేసు వాపసు తీసుకోవాలని బెదిరించాడు. ఆపై అత్యాచారానికి పాల్పడినట్లు యువతి ఫిర్యాదు చేశారు. వీడియోలు తీసి బెదిరిస్తున్నాడని పేర్కొన్నారు. కేసు నమోదైంది.

Similar News

News April 2, 2025

ప.గో: ఇంటర్ సెకండియర్ క్లాసులు ప్రారంభం

image

నూతన విద్యా విధానంలో భాగంగా ఇంటర్ సెకండ్ ఇయర్ క్లాసులు జిల్లాలో ముందస్తుగా మంగళవారం ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 23 వరకు తరగతులు జరుగుతాయని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి నాగేశ్వరరావు తెలిపారు. సమ్మర్ హాలీడేస్ అనంతరం తిరిగి జూన్ 2న మళ్లీ తరగతులు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ఇటు ఫస్టియర్ ప్రవేశాలు ఈ నెల 7 నుంచి మొదలవుతాయి. ఆ తర్వాత వారికీ తరగతులు ప్రారంభిస్తారు.

News April 2, 2025

భీమవరంలో వృద్ధురాలిపై దాడి చేసిన వ్యక్తి అరెస్ట్

image

భీమవరం పట్టణంలోని ఈ నెల 28న అమ్మిరాజు తోటలో దొంగతనం కేసులో పట్టణానికి చెందిన నిందితుడు విట్టర్ పాల్‌ను సీఐ నాగరాజు తన సిబ్బందితో కలిసి చాకచక్యంగా పట్టుకున్నారు. డీఎస్పీ జై సూర్య తెలిపిన వివరాల ప్రకారం.. వృద్ధురాలు మంగతాయారు ఇంటికి వెళ్లి దగ్గర బంధువునని చెప్పి 3 గంటల పాటు విట్టర్ కబుర్లు చెప్పాడు. ఆమె భర్త బయటకు వెళ్ళగానే వృద్ధురాలిపై బ్లేడుతో దాడి చేసి బంగారాన్ని దొంగిలించాడు.

News April 2, 2025

హత్య జరిగిన 36 గంటల్లో నిందితుడు అరెస్ట్: సీఐ

image

కాసాని రాజేశ్ మృతికి కారణమైన నిందితుడిని అరెస్ట్ చేశామని భీమవరం రూరల్ సీఐ బి.శ్రీనివాసరావు మంగళవారం తెలిపారు. ఈ నెల 30న కోట సత్తెమ్మ తల్లి జాతరలో రాహుల్, రాజేశ్ మధ్య వివాదం తలెత్తి ఘర్షణకు దారి తీసింది. ఈ క్రమంలో రాజేశ్‌ను మేకల సతీష్ అనే వ్యక్తి (చోటూ) కొట్టాడు. గాయాలతో రాజేశ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. నిందితుడ్ని 36 గంటల్లోనే అరెస్ట్ చేసినట్లు సీఐ తెలిపారు.

error: Content is protected !!