News March 21, 2025
భీమవరం: ఉద్యోగికి 15 రోజుల రిమాండ్

నిధుల దుర్వినియోగం కేసులో ఉద్యోగిని అరెస్ట్ చేసినట్లు భీమవరం డీఎస్పీ జయసూర్య తెలిపారు. వివరాల్లోకి వెళితే… భీమవరం మండలం చినఅమిరం గ్రామ పంచాయతీలో నిధుల దుర్వినియోగంపై వచ్చిన ఫిర్యాదు మేరకు గతంలో కేసు నమోదైంది. ఈ కేసులో నిందితుడైన జూనియర్ అసిస్టెంట్ గుండు రామకృష్ణను అరెస్ట్ చేసి రెండో అదనపు జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ వద్ద హాజరుపర్చగా 15 రోజుల రిమాండ్ విధించినట్లు సీఐ కాళీచరణ్ తెలిపారు.
Similar News
News March 22, 2025
ఆధార్ నమోదు ప్రక్రియపై శ్రద్ధ వహించాలి: కలెక్టర్

గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో నిర్వహిస్తున్న వివిధ సర్వేలకు నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయాలని కలెక్టర్ నాగరాణి అన్నారు. శుక్రవారం భీమవరం కలెక్టరేట్లో జిల్లాలోని మండల అభివృద్ధి అధికారులతో మాట్లాడారు. పెండింగ్ ఫైల్స్ పరిష్కారానికి మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు ప్రతిరోజు సమీక్షించాలని, జిల్లాలో 10,748 వేల మంది పిల్లలు ఆధార్ నమోదు కాలేదని సత్వరమే ఆధార్ నమోదు ప్రక్రియపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు
News March 21, 2025
ఆకివీడు: స్నానానికి దిగి ఇద్దరు విద్యార్థులు మృతి

ఆకివీడు మండలం చిన కాపవరంలోని వయ్యేరు కాలువలో శుక్రవారం స్నానానికి దిగిన ఇద్దరు విద్యార్థులు ప్రమాదవశాత్తు మునిగి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. 5వ తరగతి చదువుతున్న పడికౌరు శరత్‌కుమార్ (10) కటారి పవన్ సాయి (10)లు మధ్యాహ్నం సమయంలో ఈతకొట్టేందుకు కాలువలోకి దిగారు. ఇద్దరు ఒక్కసారిగా కాలువలో మునిగిపోయారు. వీరి మృతితో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
News March 21, 2025
ప.గో జిల్లాలో ఉగాది పురస్కారాలకు ఎంపికైన అధికారులు

పశ్చిమగోదావరి జిల్లాలో స్పెషల్ బ్రాంచ్ HC అప్పారావు, DAR ARPC వెంకట రామకృష్ణ, పాలకొల్లు ఫైర్ ADFO జానకిరామ్, తణుకు టౌన్ PS HC నరసింహారాజు, జిల్లా ARSI నాగేశ్వరరావు. కొవ్వూరు డివిజన్ లోని ఉండ్రాజవరం PS ASI రామకృష్ణ, చాగల్లు PS ASI రాజేంద్రప్రసాద్‌లు ఉగాది పురస్కారాలకు ఎంపికయ్యారని అధికారులు తెలిపారు.