News September 8, 2025

భీమవరం కలెక్టరేట్‌లో 192 అర్జీలు

image

భీమవరం కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆమె ప్రజల నుంచి 192 అర్జీలను స్వీకరించారు. అర్జీదారులకు సంతృప్తి కలిగేలా సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. తమ పరిధిలో లేని అర్జీలను సంబంధిత శాఖలకు పంపించాలని సిబ్బందికి సూచించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.

Similar News

News September 8, 2025

ఇరిగేషన్ ట్యాంకులు పునర్ నిర్మాణానికి ప్రతిపాదనలు: కలెక్టర్

image

జిల్లాలోని మైనర్ ఇరిగేషన్ ట్యాంకుల పునర్నిర్మాణానికి వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ నాగరాణి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో డ్వామా, ఇరిగేషన్, గ్రౌండ్ వాటర్, ఆర్‌డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిగూడెం మెట్ట ప్రాంతంలో గుర్తించిన 54 మైనర్ ఇరిగేషన్ ట్యాంకులను పునర్నిర్మించి భూగర్భ జలాలను పెంచేందుకు చర్యలు చేపట్టాలని ఆమె సూచించారు.

News September 8, 2025

రేపు యథావిధిగా పీజీఆర్ఎస్: కలెక్టర్

image

భీమవరం కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తారని చెప్పారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆమె సూచించారు. అలాగే 1100 నంబర్‌కు కాల్ చేసి కూడా తమ సమస్యలు తెలియజేయవచ్చని కలెక్టర్ అన్నారు.

News September 7, 2025

రైతులకు యూరియా కొరత లేకుండా చూస్తాం: కలెక్టర్

image

రైతులకు యూరియా కొరత లేకుండా అందిస్తున్నామని కలెక్టర్ సి.నాగరాణి అన్నారు. కాళ్ల మండలం కోపల్లె సొసైటీలో యూరియా వినియోగంపై జరిగిన అవగాహన సదస్సులో ఆమె పాల్గొన్నారు. సొసైటీ గోడౌన్‌లోని ఎరువుల నిల్వలను తనిఖీ చేశారు. అధికారుల సూచనల మేరకు ఎరువులను వినియోగించుకుని అధిక దిగుబడులు సాధించాలని ఆమె రైతులకు సూచించారు. సొసైటీ ఛైర్మన్ పాల్గొన్నారు.