News February 15, 2025
భీమవరం : గాయపడిన బాలుడి మృతి

భీమవరంలో ఈనెల 12న కోటేశ్వరరావు అనే బాలుడుకి(10) ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కొక్కి తగులుకుని కొంత దూరం లాక్కెళ్లింది. దీంతో గమనించిన స్థానికులు బాలుడిని ఆసుపత్రికి తరలించి, మెరుగైన చికిత్స కోసం విజయవాడకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ 13న మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు. బాలుని తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై కిరణ్ కుమార్ తెలిపారు.
Similar News
News March 13, 2025
భీమవరం: జనసేన సభకు వెళ్లే వారికి ప్రత్యేక రూట్లు

పశ్చిమ గోదావరి, గుంటూరు, తెనాలి, కృష్ణ, జిల్లాల నుంచి వెళ్లే వాహనాలు తూరంగి బ్రిడ్జి నుంచి ఉప్పలంక బైపాస్ చీడిగ, ఇంద్రపాలెం, కెనాల్ రోడ్డు, సామర్లకోట మూడు లైట్లు జంక్షన్, మూత్తా గోపాలకృష్ణ ఫ్లైఓవర్, అచ్చంపేట జంక్షన్ మీదుగా చిత్రాడ సభ ప్రాంగణానికి చేరుకొవాలన్నారు. ఆయా మార్గాల్లో అభిమానులకు భోజనాలు, మజ్జిగ వంటి సదుపాయాలను పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జాగ్రత్తగా వాహనాలు నడపాలన్నారు.
News March 13, 2025
భీమవరంలో బాంబు బెందిరింపు.. పలు కోణాల్లో దర్యాప్తు

భీమవరం విష్ణు కళాశాలలో బుధవారం బాంబు పెట్టామన్న ఈ మెయిల్ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి నుంచి మెయిల్ వచ్చిననట్లు పోలీసులు గుర్తించారు. పార్లమెంటు దాడి ఘటనలో సూత్రధారి అప్జల్ గురుకు శిక్ష విధించినందుకు నిరసనగా కళాశాలలో బాంబు పెట్టినట్లు ఈ మెయిల్లో పేర్కొన్నాడు. అది అతడి నుంచి వచ్చిందా? లేదా మరోకరు పంపించారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని DSP జయసూర్య తెలిపారు.
News March 13, 2025
నరసాపురం: బాలికపై లైంగికదాడి.. జీవితఖైదు

నరసాపురంలో ఒకరి జైలుశిక్ష పడింది. సీఐ బి.యాదగిరి వివరాల ప్రకారం.. నరసాపురం అరుంధతిపేటకు చెందిన పెడరి నర్సింహరాజు పార్కు రోడ్డులో టాయిలెట్లు శుభ్రం చేసేవాడు. ఈక్రమంలో 2017లో ఓ మైనర్ బాలికపై పలుమార్లు లైంగిక దాడి చేశాడు. భీమవరం ఫొక్సో కోర్టు జడ్జి B.లక్ష్మీనారాయణ 18మంది సాక్షులను విచారించారు. నర్సింహరాజుకు జీవిత ఖైదు, రూ.5 వేలు జరిమానా విధించారు. బాధితురాలకి రూ.50వేలు చెల్లించాలని తీర్పునిచ్చారు.