News October 15, 2025

భీమవరం: జిల్లాలో పర్యాటకాభివృద్ధిపై కలెక్టర్ సమీక్ష

image

భీమవరం కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మంగళవారం బీచ్ రిసార్ట్స్‌కు మౌలిక వసతులు కల్పించే అంశంపై అధికారులతో సమీక్షించారు. జిల్లాలో పర్యాటకం విస్తృతంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని కలెక్టర్ అన్నారు. దీనిలో భాగంగా, సముద్ర తీర ప్రాంతాన్ని ఆనుకొని పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తున్న రిసార్ట్స్‌కు తక్షణమే మౌలిక వసతులు కల్పించాలని అవసరం ఉందన్నారు.

Similar News

News October 15, 2025

కర్నూలు జీఎస్టీ విజయోత్సవ సభకు జిల్లా నుంచి 400 మంది

image

కర్నూలులో ఈనెల 16న నిర్వహించనున్న ‘సూపర్ జీఎస్టీ.. సూపర్ సేవింగ్స్’ విజయోత్సవ సభకు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి 400 మంది ట్రేడర్లు, పన్ను చెల్లింపుదారులు (టాక్స్ పేయర్స్) హాజరు కానున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొననున్న ఈ సభకు ట్రేడర్స్‌ను తరలించడానికి భీమవరం నుండి రెండు బస్సులు, పాలకొల్లు, తాడేపల్లిగూడెంల నుంచి ఒక్కో బస్సును ఏర్పాటు చేసినట్లు జేసీ రాహుల్ కుమార్ రెడ్డి మంగళవారం తెలిపారు.

News October 15, 2025

గుంతకల్లులో గంజాయి తరలిస్తూ పాలకొల్లు వాసి అరెస్ట్

image

అనంతపురం జిల్లా గుంతకల్లు హనుమాన్ సర్కిల్ వద్ద మంగళవారం ఎక్సైజ్ పోలీసులు గంజాయి అక్రమ రవాణాపై దాడులు నిర్వహించి ఇద్దరిని అరెస్టు చేశారు. వారి నుంచి 4kg గంజాయి, రవాణా కోసం ఉపయోగించిన బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు మోహన్ సుందర్ ప.గో జిల్లా పాలకొల్లు మండలం వెంకటాపురం గ్రామ వ్యక్తి కాగా, ఆయన గుత్తి మండలంలో పూజారిగా పనిచేస్తున్నట్లు గుర్తించారు.

News October 15, 2025

తణుకు: రోడ్డు ప్రమాదంలో ఇద్దరి యువకులు మృతి

image

పాలకొల్లు మండలం దిగమర్రు రోడ్డులో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తణుకునకు చెందిన ఇద్దరు యువకులు మృతి చెందారు. తణుకునకు చెందిన కొల్లి మహేశ్ రాజు (18), రాజులపాటి సాయి గణేష్(19), కూచి శరవణశర్మ బుల్లెట్ పై పేరుపాలెం బీచ్‌కు బయలుదేరారు. దిగమర్రు- పాలకొల్లు రోడ్డులో వెనుక నుంచి ఆయిల్ ట్యాంకర్ ఢీ కొట్టింది. ప్రమాదంలో మహేశ్ ఘటనా స్థలంలోనే మృతి చెందగా గణేశ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.