News October 10, 2025

భీమవరం: డీడీఓలకు రాష్ట్రస్థాయి అధికారులతో సమీక్ష

image

ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు జీపీఎఫ్, పెన్షన్ కేసుల పరిష్కారానికి అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ నాగరాణి అన్నారు. గురువారం కలెక్టరేట్లో వివిధ శాఖల డీడీఓలకు రాష్ట్రస్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఏపీ ప్రిన్సిపల్ అకౌంట్ జనరల్ శాంతి ప్రియ మాట్లాడుతూ.. అకౌంటింగ్, బిల్స్‌కు సంబంధించిన విషయాలలో డీడీవోలు పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు.

Similar News

News October 10, 2025

నేటి నుంచి శ్రీవారి ఆర్జిత సేవలు పునః ప్రారంభం

image

ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయంలో నిత్యార్జిత కల్యాణాలు, ఆర్జిత సేవలను శుక్రవారం నుంచి పునరుద్ధరిస్తున్నట్లు ఈఓ మూర్తి తెలిపారు. ఈ నెల 2 నుంచి 9 వరకు ఆలయంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరిగిన విషయం తెలిసిందే. వీటిని పురస్కరించుకుని ఈ 8 రోజులు ఆలయంలో నిత్యార్జిత కల్యాణాలు, ఆర్జిత సేవలను రద్దు చేశారు. బ్రహ్మోత్సవాలు ముగియడంతో వీటిని పునఃప్రారంభిస్తున్నట్లు తెలిపారు. భక్తులు గమనించాలని కోరారు.

News October 9, 2025

గోదావరి పుష్కరాలు ఏర్పాట్లపై జేసీ రాహుల్ సమీక్ష

image

భీమవరం కలెక్టరేట్‌లో 2027 గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై జేసీ టి.రాహుల్ కుమార్ రెడ్డి జిల్లా అధికారులతో గురువారం సమీక్ష నిర్వహించారు. యాత్రికుల సౌకర్యార్థం 42 పుష్కర ఘాట్లకు సంబంధించిన మరమ్మతులు, అప్రోచ్ రోడ్లు, తాగునీరు, శానిటేషన్, లైటింగ్, టాయిలెట్స్ పనులు తక్షణమే ప్రారంభించాలని ఆదేశించారు. రేపట్లోగా పనుల నివేదిక సమర్పించాలని జేసీ కోరారు.

News October 9, 2025

రతన్ టాటా మరణం దేశానికి తీరని లోటు: డిప్యూటీ స్పీకర్

image

పద్మవిభూషణ్ రతన్ టాటా మరణం దేశానికి తీరని లోటని డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామ కృష్ణంరాజు అన్నారు. గురువారం రతన్ వర్ధంతి సందర్భంగా పెద అమిరంలోని ఆయన విగ్రహానికి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. పారిశ్రామిక రంగానికే కాక, ప్రపంచానికే ఆయన ఆదర్శంగా నిలిచారన్నారు. గొప్ప మానవతావాదిగా ఆయన సమాజానికి చేసిన సేవలు అనిర్వచనీయమని రఘురామ కృష్ణంరాజు కొనియాడారు.