News November 30, 2025

భీమవరం: దిత్వా తుఫాన్‌తో కలెక్టర్ హచ్చరిక

image

‘దిత్వా’ తుఫాను ప్రభావంతో జిల్లాలో రానున్న రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని కలెక్టర్ నాగరాణి హెచ్చరించారు. శనివారం కలెక్టరేట్‌లో ధాన్యం కొనుగోళ్లపై జేసీ రాహుల్ కుమార్ రెడ్డితో కలిసి ఆమె సమీక్షించారు. రైతులు ఇప్పటికే కోసిన పంటను జాగ్రత్త చేసుకోవాలని సూచించారు. నూర్పిడి చేసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు కేంద్రాల ద్వారా విక్రయించాలని, తద్వారా నష్టాన్ని నివారించుకోవచ్చని ఆమె స్పష్టం చేశారు.

Similar News

News February 6, 2026

ప.గో: వరి రైతులకు ‘ఎలుక గండం’

image

ప.గో. జిల్లాలో రబీ సాగు చేస్తున్న రైతులు ఎలుకల సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 2.25 లక్షల ఎకరాల్లో వరి నాట్లు వేసిన రెండో వారం నుంచే తెగుళ్లు, ఎలుకలు పంటను నాశనం చేస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీటి నిర్మూలనకు హెక్టారుకు రూ.5 వేల వరకు ఖర్చు చేయాల్సి వస్తోందని పేర్కొంటున్నారు. అధికారులు సామూహిక చర్యలు చేపడుతున్నా ఆశించిన ఫలితం ఉండటం లేదని సాగుదారులు ఆరోపిస్తున్నారు.

News February 6, 2026

ఈ-కేవైసీ గడువులోగా పూర్తి చేయాలి: జేసీ

image

పట్టాదారు పాసుపుస్తకాల వెరిఫికేషన్, ఈ-కేవైసీ ప్రక్రియను గడువులోగా పూర్తి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన ఉండి తహశీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించారు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు, ఈ-కేవైసీ పూర్తికాని పుస్తకాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. రైతులు ఇబ్బంది పడకుండా రెవెన్యూ సేవలు పారదర్శకంగా అందించాలని స్పష్టం చేశారు.