News March 26, 2025
భీమవరం: ‘నేడు పదో తరగతి పరీక్షకు 517 డుమ్మా’

నేడు జిల్లాలో జరిగిన టెన్త్ భౌతిక శాస్త్ర పరీక్షకు 22,894 మంది విద్యార్థులు హాజరయ్యారు. మొత్తం 22,357మంది విద్యార్థులకు 517 గైర్హాజరయ్యారని డీఈవో నారాయణ తెలిపారు. ఓపెన్ స్కూల్ సైన్స్ , అండ్ టెక్నాలజీ పరీక్షకు 487 మంది విద్యార్థులకు గాను 379 విద్యార్థులు హాజరు కాగా 108 గైర్హాజరయ్యారని చెప్పారు.
Similar News
News March 29, 2025
ఏలూరులో మహిళ దారుణ హత్య.. ఏం జరిగిందంటే..!

ఏలూరులో శుక్రవారం ఉదయం మహిళ దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. చిట్టీ వ్యాపారం చేసే రమణమ్మ (65)ను తెల్లవారుజామున కాళ్లు చేతులు కట్టేసి, నోట్లో చీరకుక్కి, నైలాన్ తాడుతో ఉరివేసి, పెట్లోల్ పోసి నిప్పంటించారు. అనంతరం 10 కాసుల బంగారం, డబ్బు దోచుకుపోయారు. కుక్కలు మొరగడంతో ఎదురింటి అబ్బాయి లేచి చూసి, బంధువులకు సమాచారమిచ్చాడు. మంటలను ఆర్పి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
News March 29, 2025
భీమవరం : బాలికపై తండ్రి వరుసయ్యే వ్యక్తి లైంగిక వేధింపులు

కన్నతండ్రిలా చూసుకోవాల్సిన వ్యక్తే బాలికపై కన్నేసిన ఘటన భీమవరంలో జరిగింది. 2 టౌన్ SI ఫాజిల్ రెహ్మాన్ కథనం..భర్తతో విడిపోయిన మహిళ ఇద్దరి కుమార్తెలతో.. వచ్చేసి పదేళ్ల నుంచి సత్యవతి నగర్లో కే.గణేశ్‌తో సహజీవనం చేస్తోంది. అతనితోనూ ముగ్గురు పిల్లలు పుట్టారు. ఆమె ఇంట్లో లేనప్పుడు మొదటి భర్తకు జన్మించిన బాలికను లైంగికంగా వేధించేవాడు. తల్లి ఫిర్యాదుతో పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
News March 29, 2025
నరసాపురం: ముద్దాయికి ఆరు నెలలు జైలు శిక్ష, జరిమానా

దొంగతనం కేసులో ముద్దాయికి జైలు శిక్ష, జరిమానా విధించినట్లు కోర్టు లైజనింగ్ ఆఫీసర్ ఏఎస్సై భాస్కరరావు తెలిపారు. నరసాపురం పట్టణానికి చెందిన తిరుమాని చక్రధర్ (చక్రి) 2022 సంవత్సరంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తీ వద్ద నుంచి మొబైల్ చోరీ చేశాడన్నారు. అప్పటి ఎస్ఐ కె.సుధాకర్ రెడ్డి కేసు నమోదు చేశారు. శుక్రవారం నేరం రుజువు కావడంతో ముద్దాయికి జడ్జి 6నెలలు జైలు శిక్ష, రూ.2వేలు ఫైన్ విధించారన్నారు.