News December 21, 2025

భీమవరం: నేడే పల్స్ పోలియో

image

పశ్చిమ గోదావరి జిల్లాను పోలియో రహితంగా మార్చేందుకు తల్లిదండ్రులు సహకరించాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ గీతాబాయి విజ్ఞప్తి చేశారు. ఆదివారం జరిగే పల్స్ పోలియో శిబిరాల్లో 0-5 ఏళ్ల పిల్లలకు తప్పనిసరిగా చుక్కలు వేయించాలన్నారు. శనివారం భీమవరంలో నిర్వహించిన అవగాహన ర్యాలీని ఆమె ప్రారంభించారు. చిన్నారుల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించవద్దని, ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరారు.

Similar News

News December 28, 2025

ప.గో: సోమవారం ప్రజా సమస్యల వేదిక ఎక్కడంటే..

image

ప్రజా సమస్యల పరిష్కార వేదికను భీమవరం వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో సోమవారం నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మి తెలిపారు. పాలకోడేరు మండలం గొల్లలకోడేరులోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరగాల్సిన ఈ కార్యక్రమాన్ని తాత్కాలికంగా భీమవరానికి మార్చినట్లు పేర్కొన్నారు. అర్జీదారులు ఈ మార్పును గమనించి, తమ ఫిర్యాదులను వన్‌టౌన్‌ స్టేషన్‌లో అందజేయాలని ఎస్పీ సూచించారు.

News December 28, 2025

పీఎం లంక నన్ను దత్తత తీసుకుంది: నిర్మల సీతారామన్

image

తాను పీఎం లంకను దత్తత తీసుకోలేదని, ఆ గ్రామస్థులే తనను దత్తత తీసుకున్నారని కేంద్రమంత్రి నిర్మల సీతారామన్ అన్నారు. ఆదివారం అక్కడ జరిగిన సభలో ఆమె మాట్లాడారు. మహిళల మద్దతు మరువలేనిదని పేర్కొన్నారు. తీర ప్రాంత రక్షణ గోడ పనులు జనవరికి పూర్తవుతాయని, సముద్ర తీరం అందం దెబ్బతినకుండా పనులు చేపడుతున్నామని వివరించారు. ఈ ప్రాజెక్టు వల్ల మత్స్యకార గ్రామాలకు రక్షణ లభిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

News December 28, 2025

నిర్మలా సీతారామన్‌పై మంత్రి పయ్యావుల ప్రశంసలు

image

కోవిడ్ సంక్షోభంలో దేశాన్ని ఆర్థికంగా ఆదుకోవడంలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఎంతో కష్టపడ్డారని మంత్రి పయ్యావుల కేశవ్ కొనియాడారు. ఆదివారం పీఎం లంకలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. కూటమికి ప్రజలు వేసిన ఓటు వల్లే అమరావతి, పోలవరం ప్రాజెక్టులకు నిధులు వస్తున్నాయని తెలిపారు. గతంలో రక్షణ శాఖ, ప్రస్తుత్తం ఆర్థిక శాఖల బాధ్యతలను నిర్మలమ్మ సమర్థంగా నిర్వహిస్తున్నారని ప్రశంసించారు.